ఆస్ట్రేలియా-ఇండియా రిలేషన్స్ సెంటర్‌ అడ్వైజరీ బోర్డ్ చైర్‌గా భారతీయురాలు..!!

Indian-origin Banking Executive Swati Dave Named Chair Of Advisory Board To Centre For Australia-India Relations Details, Indian-origin Woman, Banking Executive Swati Dave ,Chair Of Advisory Board ,Centre For Australia-India Relations, Australia-India Relations, Australia Minister Penny Wong, Swati Dave, Australia Nris

భారత సంతతికి చెందిన సీనియర్ బ్యాంకింగ్ ఎగ్జిక్యూటివ్ స్వాతి దవేకు కీలక పదవి దక్కింది.భారత్-ఆస్ట్రేలియా మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ఏర్పాటైన సెంటర్ ఫర్ ఆస్ట్రేలియా ఇండియా రిలేషన్స్‌కు అడ్వైజరీ బోర్డ్ ప్రారంభ అధ్యక్షురాలిగా ఆమె నియమితులయ్యారు.

 Indian-origin Banking Executive Swati Dave Named Chair Of Advisory Board To Cent-TeluguStop.com

ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్. ఆమె నియామకాన్ని ప్రకటించారు.

ఈ ఏడాది ప్రారంభించనున్న ఈ సెంటర్.భారత్-ఆస్ట్రేలియా మధ్య బలమైన వ్యాపార, సాంస్కృతిక అవగాహనను ప్రోత్సహిస్తుందని ఆమె ఆకాంక్షించారు.

ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో అపార అనుభవం వున్న స్వాతి దవే ఈ కొత్త పాత్రలో రాణిస్తారని పెన్నీ వాంగ్ అన్నారు.

Telugu Australiapenny, Australia Nris, Australia India, Executiveswati, Chairadv

ఇకపోతే.స్వాతి దవే ప్రస్తుతం ఆసియా సొసైటీ ఆస్ట్రేలియా డిప్యూటీ ఛైర్‌గా, నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఆస్ట్రేలియా చైనా రిలేషన్స్ అడ్వైజరీ బోర్డు సభ్యురాలిగా పనిచేస్తున్నారు.ఆసియా మిషన్ ప్రకారం.

మౌలిక సదుపాయాలు, ఇంధనం, యుటిలిటీస్, పునరుత్పాదక శక్తి సహా అనేక రంగాలలో ఆమెకు 30 ఏళ్లుగా పైగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అనుభవం వుంది.గతంలో ఎక్స్‌పర్ట్ ఫైనాన్స్ ఆస్ట్రేలియాకు మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈవోగా.

నేషనల్ ఆస్ట్రేలియా బ్యాంక్, డ్యుయిష్ బ్యాంక్, ఏఎంపీ హెండర్సన్ గ్లోబల్ ఇన్వెస్టర్స్, బ్యాంకర్స్ ట్రస్ట్ వంటి దిగ్గజ ఆర్ధిక సంస్థలలో సీనియర్ పదవులను నిర్వహించారు.

Telugu Australiapenny, Australia Nris, Australia India, Executiveswati, Chairadv

ఇదిలావుండగా.సెంటర్ ఫర్ ఆస్ట్రేలియా ఇండియా రిలేషన్స్‌ విషయానికి వస్తే ఇది 24.1 మిలియన్ డాలర్ల విలువైన జాతీయ ఫ్లాట్‌ఫాం.విధాన సంభాషణలను ప్రోత్సహించడం, ఆస్ట్రేలియన్ వ్యాపారం, మెల్‌బోర్న్-ఢిల్లీ మధ్య సంబంధాలకు మద్ధతుగా నిలిచేలా ఆస్ట్రేలియాలోని భారతీయ ప్రవాస సంఘాలను నిమగ్నం చేయడం ఈ సెంటర్ విధులు.వీటితో పాటు స్కాలర్స్ ప్రోగ్రామ్, గ్రాంట్లు, ఫెలోషిప్ ప్రోగ్రామ్‌లను కూడా నిర్వహిస్తుంది.కాగా.2020లో భారతదేశంలో జన్మించిన జనాభా ఆస్ట్రేలియాలో నివసిస్తున్న విదేశీయుల్లో రెండవ అతిపెద్ద సమూహంగా నిలిచింది.వీరిలో మూడు శాతం మంది ఆస్ట్రేలియన్లు భారతీయ వారసత్వాన్ని కలిగి వున్నారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube