బుకర్‌ప్రైజ్ 2020 రేసులో భారత సంతతి రచయిత్రి: తొలి రచనకే అరుదైన గుర్తింపు

భారత సంతతికి చెందిన రచయిత్రి అవ్ని దోషి బుకర్ ప్రైజ్ 2020 రేసులో నిలిచారు.ఆరుగురు సభ్యులతో అవార్డ్ కమిటీ విడుదల చేసిన షార్ట్ లిస్టులో ఆమె ఒకరు.

 Indian Origin Avni Doshi Makes It To Booker Prize 2020 Shortlist, Indian-origin-TeluguStop.com

అవ్ని తొలి రచనకే ఈ ఘనత సాధించారు.ఆమె రచించిన ‘‘ Burnt Sugar’’ రచనకు గాను తుది జాబితాలో నిలిచారు.

లండన్‌లో జరిగిన వర్చువల్‌ కార్యక్రమంలో ఈ లిస్ట్‌ను అవార్డ్ కమిటీ ఆవిష్కరించింది.

తల్లీకూతుళ్ల మధ్య అసాధారణ, స్వచ్ఛమైన, విడదీయలేని వాస్తవికమైన బంధాన్ని అద్భుతంగా వర్ణించినందుకు గానూ అవ్ని దోషికి ఎంట్రీ లభించిందని నిర్వాహకులు వెల్లడించారు.

అక్టోబర్ 2019 నుంచి సెప్టెంబర్ 2020 మధ్య కాలంలో ప్రచురితమైన 13 నవలలను జడ్జీలు పున: పరిశీలన తర్వాత షార్ట్ లిస్టులను ప్రకటించారు.నవంబర్‌లో విజేతను ప్రకటించి ప్రైజ్‌మనీ కింద 50 వేల పౌండ్లను అందజేస్తారు.

అవ్ని దోషి అమెరికాలో పుట్టి ప్రస్తుతం దుబాయ్‌లో స్థిరపడ్డారు.బుకర్ ప్రైజ్ నిబంధనల ప్రకారం ఏ దేశానికి చెందిన వారైనా తమ రచనలను ఇంగ్లీష్‌లో వ్రాసి.అవి యూకే లేదా ఐర్లాండ్‌లో ప్రచురించబడాలి.షార్ట్ లిస్ట్ అయిన ప్రతి రచనకు నవంబర్‌లో జరిగే పురస్కార ప్రదాన కార్యక్రమంలో 2,500 పౌండ్లను అందజేస్తారు.2019లో మార్గరెట్ అట్వుడ్ రచించిన ‘‘ టెస్టామెంట్స్’’ బెర్నార్డిన్ ఎవారిస్టో రచించిన ‘‘ గర్ల్ , ఉమెన్, అదర్’’లకు సంయుక్తంగా దక్కింది.1969లో ఏర్పాటైన బుకర్‌ప్రైజ్‌ను సాహిత్య రంగంలో అత్యున్నత అవార్డ్‌గా భావిస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube