హ్యూస్టన్ మ్యూజిక్ ఫెస్ట్‌లో మరణం: భారత సంతతి యువతి భారతీ షహానీకి కన్నీటి వీడ్కోలు

గత శుక్రవారం టెక్సాస్ రాష్ట్రం హ్యూస్టన్‌లో జరిగిన ఆస్ట్రోవరల్డ్ మ్యూజిక్ ఫెస్ట్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన భారత సంతతికి చెందిన భారతీ షహానీ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి.ఆమెకు కడసారి వీడ్కోలు పలికేందుకు మంగళవారం భారతీ కుటుంబసభ్యులు, స్నేహితులు, హ్యూస్టన్‌లోని భారతీయ కమ్యూనిటీ పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

 Indian-origin Astroworld Victim Bharti Shahani's Funeral Services Held In Housto-TeluguStop.com

ఇంతటి విషాద సమయంలో కూడా భారతీ కుటుంబసభ్యులు ఆమె అవయవాలను దానం చేసి ఆదర్శంగా నిలిచారు.

టెక్సాస్‌ అగ్రికల్చరల్ అండ్ మెకానికల్ యూనివర్సిటీలో చదువుకుంటున్న భారతీ షహానీ.

అస్ట్రోవరల్డ్ ఫెస్టివల్‌కు హాజరై అక్కడ జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డారు.అనంతరం సహాయక బృందాలు ఆమెను ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ భారతీ బ్రెయిన్ డెడ్ అయ్యారు.

అనంతరం నవంబర్ 11న భారతీ మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు అధికారికంగా ప్రకటించారు.దీంతో మ్యూజిక్ ఫెస్ట్‌లో మరణించిన వారి సంఖ్య 9కి చేరింది.

Telugu American Pop, Astroworldmusic, Bharti Shahani, Bhartishahanis, Houston, I

భారతి ఆమె సోదరి నమ్రతా షహానీ, కజిన్ మోహిత్ బెల్లానీ కలిసి మ్యూజిక్ ఫెస్టివల్‌కు హాజరయ్యేందుకు వెళ్లారు.అయితే ప్రేక్షకులు వేదికపైకి చొచ్చుకురావడంతో వీరు ముగ్గురు చెల్లాచెదురవ్వడంతో పాటు మొబైల్ ఫోన్‌‌లను పొగొట్టుకున్నారు.అయితే మిగిలిన ఇద్దరికి భారతి కనిపించలేదు.కొద్దిసేపటి తర్వాత ఊపిరి తీసుకోలేని స్థితిలో ఆమె కనిపించడంతో హుటాహుటిన హ్యూస్టన్ మెథడిస్ట్ ఆసుపత్రికి తరలించారు.మార్గమధ్యంలో భారతి పలుమార్లు గుండెపోటుకు గురైనట్లు కుటుంబసభ్యులు తెలిపారు.ఇక ఈ తొక్కిసలాటలో ప్రాణాలను కోల్పోయిన వారిని జాకబ్ జురినెక్ (21), జాన్ హిల్గర్ట్ (14), బ్రియానా రోడ్రిగ్జ్ (16), ఫ్రాంకో పాటినో (21), ఆక్సెల్ అకోస్టా (21), రూడీ పెనా (23), మాడిసన్ డుబిస్కీ (23), డానిష్ బేగ్ (27)లుగా గుర్తించారు.

ఇక ఈ విషాదంపై సింగర్ ట్రావిస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఆస్ట్రోవరల్డ్ ఫెస్టివల్‌ వల్ల తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు.

ఈ క్లిష్ట సమయంలో హ్యూస్టన్ కమ్యూనిటీతో కలిసి పనిచేస్తానని ట్రావిస్ చెప్పారు.ఘటన జరిగిన వెంటనే స్పందించిన హ్యూస్టన్ పోలీస్ శాఖ, అగ్నిమాపక శాఖ, ఎన్ఆర్‌జీ పార్క్‌ అధికారులు, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఆస్ట్రోవరల్డ్‌ మ్యూజిక్‌ ఫెస్టివల్‌లో భాగంగా ప్రముఖ అమెరికన్‌ ర్యాప్‌ సింగర్‌ ట్రెవిస్‌ స్కాట్‌ స్టేజిపైకి రాగానే జనం ఒక్కసారిగా వేదికపైపునకు దూసుకెళ్లారు.దీంతో అందరూ భయాందోళనకు గురయ్యారు.

బయటకు వెళ్లేందుకు పరుగులు తీస్తున్న క్రమంలో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.ఇదే క్రమంలో తొక్కిసలాట జరిగిందని అధికారులు వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube