నాసా స్పేస్‌ఎక్స్ క్రూ -3 మిషన్‌ : క్వారంటైన్‌లో భారత సంతతి వ్యోమగామి రాజాచారి

Indian Origin Astronaut In Quarantine With Crew Before Flight To Iss On Oct 31

బిలియనీర్ ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్.అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) సంయుక్తంగా చేపట్టిన క్రూ – 3 మిషన్‌ లాంచింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

 Indian Origin Astronaut In Quarantine With Crew Before Flight To Iss On Oct 31-TeluguStop.com

అక్టోబర్ 31న జరిగే ఈ ప్రయోగంలో స్పేస్ ఎక్స్ డ్రాగన్ వెహికల్ ద్వారా వ్యోమగాములను ఫాల్కన్ 9 రాకెట్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి మోసుకెళ్లనుంది.ఈ క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్‌కు భారత సంతతికి చెందిన వ్యోమగామి రాజాచారి మిషన్ కమాండర్‌గా వ్యవహరిస్తారని సానా తెలిపింది.

చారికి తోడుగా టామ్ మార్ష్‌బర్న్న, కైలా బారన్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన మాథియస్ మౌరర్‌లు ఈ మిషన్‌లో పాలుపంచుకుంటారని నాసా ఇప్పటికే వెల్లడించింది.

 Indian Origin Astronaut In Quarantine With Crew Before Flight To Iss On Oct 31-నాసా స్పేస్‌ఎక్స్ క్రూ -3 మిషన్‌ : క్వారంటైన్‌లో భారత సంతతి వ్యోమగామి రాజాచారి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మరోవైపు కోవిడ్ నిబంధనలతో పాటు స్టాండర్డ్ లాంచ్ ప్రోసీజర్‌ను అనుసరించి ఈ మిషన్‌లో పాల్గొంటున్న వారిని అక్టోబర్ 16 నుంచి క్వారంటైన్‌లో వుంచారు అధికారులు.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న వ్యోమగాములు కోవిడ్ బారినపడకుండా వుండేందుకే వీరిని క్వారంటన్‌లో వుంచినట్లు నాసా తెలిపింది.క్వారంటైన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ నలుగురు వ్యోమగాములకు రెండు సార్లు కోవిడ్ నిర్ధారణా పరీక్షలు నిర్వహించనున్నారు.

క్రూ సభ్యులు ఆరు నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని ల్యాబ్‌లలోనే విధులు నిర్వర్తించనున్నారు.ఇప్పటికే అక్కడ వున్న క్రూ 2 సభ్యుల నుంచి వీరు బాధ్యతలు స్వీకరిస్తారు.

దీనితో పాటు ఎక్స్‌పెడిషన్ 66 సభ్యులతో కలిసి పనిచేస్తారు.క్రూ- 3 ప్రయోగాన్ని అక్టోబర్ 31న ఉదయం 11.51కి నిర్వహించున్నారు.

Telugu Artemis Project‌, Crew- 3 Experiment, European Space Agency, Indian, Indian Origin Astronaut In Quarantine With Crew Before Flight To Iss On Oct 31, Kyla Baron, Massachusetts Institute Of Technology, Tom Marshburnna-Telugu NRI

ఎవరీ రాజాచారి:

మ‌సాచుసెట్స్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ(ఎంఐటీ) ఎయిర్ ఫోర్స్ అకాడ‌మీలో రాజా చారి శిక్ష‌ణ పొందారు.యూఎస్ నావల్‌ టెస్ట్ పైల‌ట్ స్కూల్‌లో శిక్ష‌ణ పొందిన ఏకైక భార‌త సంతతి వ్య‌క్తి కూడా ఈయ‌నే కావ‌డం విశేషం.ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ క్లాసుల కోసం నాసా అత‌న్ని 2017లో ఎంపిక చేసింది.

కఠిన శిక్షణను పూర్తి చేసుకున్న రాజాచారి మూన్‌ మిష‌న్‌కు కూడా అర్హ‌త సాధించిన‌ట్లు గతంలోనే నాసా ప్రకటించిన సంగతి తెలిసిందే.నాసా 2024లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆర్టెమిస్ ప్రాజెక్ట్‌’కు ఎంపికైన వ్యోమ‌గాముల్లో ఆయన కూడా ఒకరు.

మిల్వాకీలో జన్మించిన రాజాచారి తండ్రి భారతీయుడు కాగా, తల్లి అమెరికన్.ఆయన బాల్యం తల్లి స్వగ్రామం అయోవాలోని సెడార్ ఫాల్స్‌లోనే గడిచింది.

యూఎస్ ఎయిర్‌ఫోర్స్‌లో కల్నల్ స్థాయికి చేరిన రాజా చారికి టెస్ట్ పైలట్‌గా విశేషమైన అనుభవం వుంది.ఎఫ్ 35, ఎఫ్ 15, ఎఫ్ 16, ఎఫ్ 18లో 2,500 గంటల పాటు విమానయానం చేసిన అనుభవం ఆయన సొంతం.

ఇరాక్ యుద్ధంతో పాటు కొరియా ద్వీపకల్పంలోనూ రాజాచారి అమెరికా వాయుసేన తరపున సేవలందించారు.మసాచుసెట్స్‌లోని కేంబ్రిడ్జ్‌లో మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటిక్స్, ఆస్ట్రోనాటిక్స్‌లో మాస్టర్ డిగ్రీ పొందారు.

అనంతరం మేరీల్యాండ్‌లోని పటుక్సెంట్ నదిలో యూఎస్ నావల్ టెస్ట్ పైలట్ స్కూల్, కాన్సాస్‌లోని ఫోర్ట్ లీవెన్‌వర్త్‌లోని యూఎస్ ఆర్మీ కమాండ్, జనరల్ స్టాఫ్ కాలేజీలోనూ శిక్షణ పూర్తి చేసుకున్నారు.

#Artemis Project #Kyla Baron #Tom Marshburnna #Crew #Indian

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube