COP- 26 : భారత సంతతి కళాకారుడికి అరుదైన గౌరవం.. వాతావరణంపై షార్ట్ ఫిల్మ్, వీక్షించనున్న దేశాధినేతలు

యూకేలో స్థిరపడిన భారత సంతతి కళాకారుడు సౌమిక్ దత్తా వచ్చే వారం గ్లాస్గోలో జరిగే COP- 26 సమ్మిట్‌లో దర్శకుడిగా అరంగేట్రం చేయనున్నారు.ఆ సమయంలో అతని క్లైమేట్ యాక్షన్ ఫోకస్డ్ ‘‘సాంగ్స్ ఆఫ్ ది ఎర్త్’’ ప్రదర్శించనున్నారు.

 Indian Origin Artists Climate Action Film To Premiere At Cop 26 Summit In Glasg-TeluguStop.com

లండన్‌కు చెందిన మల్టీ డిసిప్లినరీ సౌమిక్ .ఎర్త్ డే నెట్‌వర్క్ భాగస్వామ్యంతో ఫిల్మ్, మ్యూజిక్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయడానికి ఫిబ్రవరిలో బ్రిటీష్ కౌన్సిల్ క్లైమేట్ ఛేంజ్ క్రియేటివ్ కమీషన్‌ను గెలుచుకున్నారు.

ఫలితంగా ‘‘సాంగ్స్ ఆఫ్ ది ఎర్త్’’ ను ఆయన రూపొందించారు.వాతావరణ మార్పులకు ప్రతిస్పందించే ఎనిమిది ట్రాక్ ఆల్బమ్‌లతో కూడిన యానిమేషన్ చిత్రాన్ని సౌమిక్ రూపొందించారు.ఇందులో క్లైమేట్ మైగ్రేషన్, విపరీత వాతావరణం, సముద్ర కాలుష్యం, అటవీ నిర్మూలనలను ఆయన ప్రస్తావించారు.ఈ వారం 10 డౌనింగ్ స్ట్రీట్‌లో దీనిని ప్రీమియర్ చేయనున్నారు.

కలుషితమైన మహాసముద్రాలు, విషపూరిత నదులు మనకు తిరిగి రావని సౌమిక్ అన్నారు.సాంగ్స్ ఆఫ్ ది ఎర్త్‌కు యువత స్పందించాలని తమ చుట్టూ వున్న వాతావరణంలో చిన్న మార్పుల ద్వారా ప్రకృతిని కాపాడవచ్చని ఆయన సూచించారు.

మంచి పౌరుడు అనిపించుకోవడానికి ముందు ఈ ప్రవర్తనను అలవరచుకోవాలని సౌమిక్ దత్తా చెప్పారు.

ఇక 24 నిమిషాల నిడివి వున్న ఈ చిత్రంలో భారతీయ చిత్రకారులు సచిన్ భట్, అంజలి కామత్‌లు యానిమేషన్ సహయం చేశారు.

పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆశా అనే యువ పర్యావరణ వేత్త తప్పిపోయిన తన తండ్రిని సుందర్‌బన్స్ డెల్టా ఒడ్డున కాలిపోతున్న అడవులు, కరిగిపోతున్న ధ్రువపు ప్రాంతాల గుండా వెతకడాన్ని హృద్యంగా చిత్రీకరించారు.తాను వ్రాసిన, దర్శకత్వం వహించిన తొలి షార్ట్ ఫిల్మ్ ఇదేనని దత్తా చెప్పారు.

సచిన్ భట్, అంజలి కామత్‌లతో కలిసి పనిచేయడం తనకు గర్వంగా వుందన్నారు.ఈ షార్ట్‌ఫిల్మ్‌ను నవంబర్ 2న ఐక్యరాజ్యసమితి నిర్వహించే COP -26 బ్లూజోన్‌లో విడుదల చేయనున్నారు.

Telugu Cop Summit, Indian Origin, Indianorigin, Primenarendra, Earth, Soumik Dut

కాగా.భారత ప్రధాని నరేంద్ర మోడీ నేటి నుంచి నవంబర్ 2 వరకు విదేశాల పర్యటనలో ఉండనున్నారు.ఇటలీ, యుకేలో ప్రధాని మోదీ పర్యటన ఉంటుంది.ఇటలీలో 16వ జీ 20 శిఖరాగ్ర సదస్సులో ప్రధాని పాల్గొననున్నారు.ఇక గ్లాస్గో వేదికగా జరిగే కాప్ – 26 సదస్సుకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు.వాతావరణ, పర్యావరణ మార్పులపై కాప్ – 26 సదస్సులో చర్చ జరుగనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube