ఐక్యరాజ్యసమితి చీఫ్ రేసులో భారత సంతతి మహిళ..!!!

అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక-, సామాజిక అభివృద్ధి, మానవ హక్కులపై సమిష్టి కృషి లాంటి కార్యక్రమాలను చేపట్టి అమలు చేసేందుకు, ప్రపంచదేశాలు సమష్టిగా ఏర్పాటు చేసుకున్న సంస్థ ఐక్యరాజ్యసమితి.ఈ ప్రతిష్టాత్మక సంస్థకు అధిపతిగా సెక్రటరీ జనరల్ వుంటారు.ఈ పదవి కోసం ఎన్నో దేశాలు ప్రయత్నిస్తూ వుంటాయి.తాజాగా ఐరాస చీఫ్ పదవి కోసం భారత సంతతికి చెందిన అరోరా ఆకాంక్ష బరిలో నిలిచారు.

 Indian Origin Arora Akanksha, 34, Announces Her Candidacy To Be Un Chief,  Indi-TeluguStop.com

ప్రస్తుత ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌గా వ్యవహరిస్తున్న ఆంటోనియో గుటెరస్ పదవీకాలం త్వరలో ముగియనున్న సంగతి తెలిసిందే.34 ఏళ్ల అరోరా ఆకాంక్ష ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) ఆడిట్ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నారు.ప్రపంచంలోనే అత్యున్నత దౌత్యవేత్త పదవికి తాను పోటీ చేస్తున్నట్లు ఆకాంక్ష గత నెలలోనే తెలిపారు.ఇందుకు సంబంధించి ఈ నెలలో అరోరా‌ఫర్‌ఎస్‌జీ పేరిట ఆమె ప్రచారం సైతం ప్రారంభించారు.

అలాగే రెండున్నర నిమిషాలు వున్న ప్రచార వీడియోను సైతం విడుదల చేశారు.ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం లోపల నడుస్తూ ఆకాంక్ష ఈ వీడియోను రూపొందించారు.

గడిచిన 75 సంవత్సరాలుగా ఐక్యరాజ్యసమితి ప్రపంచానికి ఇచ్చిన వాగ్థానాన్ని నెరవేర్చలేదని.శరణార్థులు రక్షించబడలేదని ఆమె అన్నారు.

అందుకే ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌గా తాను పోటీ చేస్తున్నానని తెలిపారు.

కాగా, ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ మరోసారి బరిలో నిలవాలని కోరుతున్నారు.

ఆయన మొదటి విడత పదవీకాలం ఈ ఏడాది డిసెంబర్ 31తో ముగుస్తుంది.కొత్త సెక్రటరీ జనరల్ 2022 జనవరి 1న బాధ్యతలు స్వీకరిస్తారు.2017 జనవరి 1న గుటెరస్ సెక్రటరీ జనరల్‌గా ప్రమాణం చేశారు.ఇక ఆకాంక్ష విషయానికి వస్తే ఆమె టొరంటోలోని యార్క్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ స్టడీస్‌లో డిగ్రీ పట్టా అందుకున్నారు.

కొలంబియా యూనివర్సిటీ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చేశారు.భారతదేశంలో జన్మించిన అరోరా ఆకాంక్షకు ఓసీఐ కార్డ్ వుంది.అలాగే కెనడా పౌరురాలిగా ఆ దేశ పాస్‌పోర్ట్ కలిగివున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube