అమెరికా సుప్రీంకోర్డు జడ్జి రేసులో 20 మంది: లిస్టులో భారతీయుడికి చోటు

క్యాన్సర్‌తో శుక్రవారం మరణించిన ప్రఖ్యాత న్యాయ కోవిదుడు, అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి రూత్ బాడర్ గిన్స్‌బర్గ్ స్థానంలో మరొకరిని నియమించేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.వీలైనంత త్వరలోనే జడ్జిని నియమిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

 Indian-american Amul Thapar In The Race To Replace Ruth Bader Ginsburg, Indian-a-TeluguStop.com

ఈ నేపథ్యంలో ఆయన వద్ద సుమారు 20 న్యాయమూర్తుల లిస్టు ఉన్నట్లుగా తెలుస్తోంది.వీరిలో భారత సంతతికి చెందిన అముల్ థాపర్ కూడా ఉన్నారు.
ఎప్పటి నుంచో సుప్రీంకోర్టు జడ్జి రేసులో ఆయన పేరు వినిపిస్తూనే వుంది.2018లో పదవీ విరమణ చేసిన జస్టిస్ స్టీఫెన్ కెన్నడీ స్థానంలో థాపర్ నియామకం ఇలా లాంఛనమేనని అనుకున్నారంతా.కానీ అనూహ్యంగా బ్రెట్ కవనాగ్ ఛాన్స్ కొట్టేశారు.51 ఏళ్ల థాపర్ ప్రస్తుతం 6వ యూఎస్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌లో న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు.ఆయన తల్లిదండ్రులు రాజ్‌థాపర్, వీణా భల్లా.వీరు భారత్ నుంచి అమెరికాకు వలస వెళ్లారు.ఈ దంపతులకు అముల్ థాపర్ డెట్రాయిట్‌లో జన్మించారు.

బోస్టన్‌లో కళాశాల విద్యను అభ్యసించిన థాపర్.

బర్కిలీలోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో న్యాయవాద పట్టా పొందారు.సుప్రీంకోర్టు జడ్జిగా థాపర్‌ను ట్రంప్ నియమిస్తే.

ఈ అత్యున్నత పదవిని చేపట్టిన రెండవ భారత సంతతి వ్యక్తిగా ఆయన రికార్డుల్లోకి ఎక్కుతారు.అముల్ థాపర్ కంటే ముందు శ్రీ శ్రీనివాసన్ అనే భారత సంతతి న్యాయమూర్తి 2013లో బరాక్ ఒబామా ఆయనను సుప్రీంకోర్టు జడ్జిగా నియమించారు.

కాగా రూత్ బాడర్ స్థానంలో మహిళలనే న్యాయమూర్తిగా నియమిస్తామన్నారు ట్రంప్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube