కువైట్ లో ఆ కేంద్రాలకి క్యూ కడుతున్న భారతీయులు..  

విదేశాలలో ఉంటున్న భారతీయులు ఇప్పుడు మనీ ఎక్చేంజ్ కేంద్రాలకి క్యూ కడుతున్నారు ఎక్కడ ఈ కేంద్రాలని పరిశీలించినా అక్కడ భారతీయులుతో బారులు తీరిన కేంద్రాలే కనిపిస్తున్నాయి ఇంతకీ ఎందుకు ఇంతగా భారతీయులు అక్కడ పోటీ పడుతున్నారు అంటే విదేశీ కరెన్సీ తో పోల్చితే భారత రూపాయి విలువ భారీగా పతనం అవుతోంది…మంగళవారం ఒక డాలర్ తో రూపాయి విలువ 70.08గా నమోదైంది..ఎన్నడూ లేని విధంగా దిగజారిపోయింది..అయితే

Indian NRIs Queline At Foreign Currency Exchange In UAE-

Indian NRIs Queline At Foreign Currency Exchange In UAE

రూపాయి విలువ ఇంతగా దిగాజారిపోవడంతో సగటు భారత పౌరుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు..ఇదిలాఉంటే విదేశాలలో ఉంటున్న ప్రవాసీయులు మాత్రం ఒకింత సంబరపడుతున్నారు..తమవద్ద ఉన్న విదేశీ కరెన్సీని భారతీయ కరెన్సీలోకి మార్చేందుకు క్యూలు కడుతున్నారు. గల్ఫ్ దేశాలతోపాటు ఆయా దేశాల్లోని మనీ ఎక్చేంజ్ కేంద్రాలకు ఎన్నారైలు ఎగబడుతున్నారు..గతంలో ఇదే తరహాలో రూపాయి విలువ పతనం అవ్వడంతో ఇదే తరహాలో తమ కరెన్సీ ని భారత కరెన్సీ కి మార్చేసుకున్నారు..

Indian NRIs Queline At Foreign Currency Exchange In UAE-

ఇప్పుడు కూడా భారతీయులు ఇదే తరహాలో కరెన్సీ ని భారత కరెన్సీ కి మార్చేస్తున్నారు..కువైట్‌తోపాటు అత్యధిక విలువ కలిగిన దేశాల కరెన్సీని భారత కరెన్సీలోకి మార్చుతున్నారు…అయితే మరీ ముఖ్యంగా కువైట్‌లోని భారతీయులు మనీ ఎక్చేంజ్ కేంద్రాల వద్దకు క్యూకట్టారు. ఎందుకంటే రూపాయి భారీగా క్షిణించిన తర్వాత ఒక్క కువైట్ దినార్‌కు మారకపు విలువ రూ.230.60 గా నమోదైంది…దాంతో తక్కువ వెతనాలు వస్తున్న అనేకమంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు..