కరోనా కాటుకు విదేశాలలో బలై పోయిన “భారతీయులు” ఎంతమందో తెలుసా....

కరోనా రక్కసి ఎంతో మంది కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపింది.చైనా లో పుట్టిన మహమ్మారి అక్కడి నుంచీ మెల్ల మెల్లగా అన్ని దేశాలపై తన ప్రభావం చూపించింది.

 Indian Nris Died For Kovid 19 Around 70 Countries-TeluguStop.com

ముఖ్యంగా అమెరికాపై మొదటి వేవ్ చూపించిన ప్రభావం బహుశా ఏ దేశం మీద ఇప్పటి వరకూ చూపించలేదు.అమెరికా తరువాత రష్యా, సింగపూర్ ఇలా అన్ని దేశాలలో కరోనా విరుచుకుపడింది.

దాదాపు అన్ని దేశాలలో ప్రజలు లక్షల సంఖ్యలో ప్రాణాలు పోగొట్టుకున్నారు.ఈ క్రమంలోనే ఆయా దేశాలలో ఉన్న భారత ఎన్నారైలు కుడా కరోనా రక్కసికి బలై పోయారు.

 Indian Nris Died For Kovid 19 Around 70 Countries-కరోనా కాటుకు విదేశాలలో బలై పోయిన “భారతీయులు” ఎంతమందో తెలుసా….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందులో వైద్యులు, ప్రముఖ శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, వ్యాపారులు ఇలా ఎంతో మంది భారతీయులు మృతి చెందారు.

భారత పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న క్రమంలో విదేశాలలో ఉన్న భారతీయులలో ఎంతమంది కరోనా కాటుకు బలై పోయారు అని అడిగినప్పుడు కేంద్ర మంత్రి మురళీ వివరాలు వెల్లడించారు.

కరోనా రక్కసికి దాదాపు 70 దేశాలల్లో సుమారు 3,570 మంది మృతి చెందారని, ఇందులో అత్యధికంగా 1,154 మరణాలు ఒక్క సౌదీ లో జరిగాయని తెలిపారు.అలాగే యూఏఈ లో దాదాపు 894 మంది మృతి చెందగా ఒమన్ లో సుమారు 384 మంది మృతి చెందారని తెలిపారు.

ఇక కువైట్ లో 546 మంది కరోనాకు బలై పోయారని, బహ్రెయిన్ లో 196 మంది, ఖతర్ లో 106 మంది మృతి చెందారని తెలిపారు.ప్రపంచ వ్యాప్తంగా సుమారు 12.6 మిలియన్స్ భారతీయులు ఉండగా వారిలో 8.9 మిలియన్స్ ఆరు దేశాలలో ఉన్నారని, ఒక్క యూఏఈ లో ఏకంగా 3.4 మిలియన్స్ మంది భారతీయులు ఉంటున్నారని తెలిపారు.సౌదీ అరేబియాలో 2.6 మిలియన్స్ మంది ఉండగా కువైట్, బహ్రెయిన్ ఖతర్ లలో కలిపి 2.9 మిలియన్స్ మంది ఉన్నారని తెలిపారు.

#Murali #Singapore #Russia #Doctors #Indians

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు