అమెరికాలో భారతీయుడి కిడ్నాప్...హత్య..!!!

అమెరికాలో భారతీయులపై దాడులు, హత్యలు నానాటికి పెరిగిపోతున్నాయి.ఎప్పుడు ఎవరిపై ఎక్కడ దాడి జరిగుతుందో ఊహించని విధంగా ఉన్నాయి ప్రస్తుత పరిస్థితులు.

 Indian Nri Person Tusharatremurderinus-TeluguStop.com

బయటకి వెళ్ళాలంటే భయపడుతున్న క్రమంలో ఏకంగా ఇళ్ళలోకి చొరబడి మరీ హత్యలు చేస్తున్న ఘటనలు భారతీయులలో మరింత గుబులు రేపుతున్నాయి.తాజాగా జరిగిన ఓ సంఘటన ఇప్పుడు సినిమా ఫక్కీ రేంజ్ లో జరగడమే కాకుండా కక్ష పూరితంగా జరిగిందని అంటున్నారు.

వివరాలలోకి వెళ్తే.

అమెరికాలోని వాషింగ్టన్ లో ఉంటున్న ప్రవాస భారతీయుడు తుషార్ ఆత్రే అనే వ్యక్తి ఆర్ధికంగా బాగా స్థిరపడ్డారు.

అమెరికాలో పలు కంపనీలు స్థాపించిన ఆయన ఊహించని విధంగా హత్య కాబడ్డారు.కాలిఫోర్నియాలోని శాంతాక్రూజ్ ప్రాంతంలో ఉంటున్నారు.నిన్నటి రోజున రాత్రి సమయంలో కొందరు దొంగలు ఆయన ఉంటున్న ఇంటికి చేరుకొని బలవంతంగా తలుపు బద్దలు కొట్టిమరీ ఇంట్లోకి ప్రవేశించారు.

Telugu Indo American, Telugu Nri Ups, Tushar Atre-

నిద్రిస్తున్న ఆత్రే ని పట్టుకుని ఆయన స్నేహితురాలి కారులో ఎక్కించుకుని బలవంతంగా బయటకి తీసుకెళ్ళారు.ఈ క్రమంలోనే ఇంట్లోనే ఉన్న మరొక వ్యక్తి పోలీసులకి తెలుపగా ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు విచారణ జరిపి కారు వెళ్ళిన మార్గాని పరిశీలించి వెళ్ళగా కారుని శాంతాక్రూజ్ ప్రాంతంలోని కొండల్లో కనుగొన్నారు.అదే కారులో ఆత్రే మరణించి ఉన్నారు.

అయితే ఈ హత్య జాత్యహంకార కోణంలో జరిగిందా లేక మరేదన్న కిరాయి హత్యగా జరిగిందా అనేకోనంలో విచారణ చేస్తున్నారు పోలీసులు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube