గల్ఫ్ లో భారత ఎన్నారై మిస్సింగ్..

పొట్ట చేతపట్టుకుని ఎక్కడో మారు మూల పల్లెలు నుంచీ పరాయి దేశాలకి పని కోసం నాలుగు డబ్బులు ఎక్కువగా వస్తాయని ఆశతో ఎంతో మంది భారతీయులు ఉద్యోగాలకి , కూలీలుగా పని చేయడానికి వెళ్తున్నారు.అయితే తీరా అక్కడకి వెళ్ళిన తరువాత ఉపాది కోసం ఉద్యోగం దొరకకా అక్కడ ఉండలేక సొంత ఊరు రాలేక నరకం అనుభవించే వారు ఎంతో మంది ఉన్నారు.

 Indian Nri Missing For More Than 3 Months In Uae-TeluguStop.com

కొంతమంది అక్కడే చనిపోతే మరి కొంతమంది ఎక్కడ ఉంటున్నారో ఎలా ఉంటున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.

ఇదే తరహాలో గల్ఫ్ కీ వెళ్ళిన కేరళాకి చెందిన ఒక వ్యక్తి ఆచూకీ లభ్యం కావడం లేదంటూ ఒక కుటుంభం ఆందోళన చెందుతోంది…వివరాలలోకి వెళ్తే.కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందిన అబ్దుల్ లతీఫ్ అనే 38 ఏళ్ల వ్యక్తి సంవత్సరం క్రితం అదృశ్యం అయ్యాడు.అబుదాబి నగరంలో చిన్న జాబ్ చేస్తూ అక్కడే ఉంటున్నాడు అయితే రంజాన్ మాసం ప్రారంభానికి ముందు మే 16 నుంచి లతీఫ్ ఆచూకీ లభ్యం కావడం లేదు…ఒక ఫోను కూడా లేకపోవడంతో

అతడి కుటుంభ సభ్యులు అక్కడ తెలిసిన వారిని ఎంతో మందిని సంప్రదించినా ఫలితం లేకపోయింది.

అధికారులను సంప్రదించినా వారు కూడా చేతులు ఎత్తేశారు.అక్కడి హాస్పిటళ్లు, మార్చురీలలో వెతికామని, సమాచారం కోసం ఎదురుచూస్తున్నామని లతీఫ్ కుటుంబ సభ్యుడు తెలియజేశారు.అక్కడి ప్రజలకు లతీఫ్‌కు సంబంధించిన సమాచారం ఉంటే తెలియజేయాలని కోరుతున్నారు.సమాచారం తెలిస్తే 0507112435 ఫోన్ చేసి కుటుంభ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube