యూఏఈ లో భారత ఎన్నారై లులు గ్రూప్స్ బంపర్ ఆఫర్...50 శాతం డిస్కౌంట్....

Indian Nri Lulu Groups Bumper Offer In Uae 50 Discount

యూఏఈ లో భారతీయ వ్యాపార దిగ్గజాలలో ప్రధాన వ్యక్తిగా పేరొందిన భారతఎన్నారై యూసఫ్ గురించి తెలియని వారు ఉండరు.యూఏఈ లో ఆయన స్థాపించిన వ్యాపారాలు, వివిధ రకాల సంస్థలు ద్వారా లక్షలాది మంది ఉపాది పొందుతూ ఉంటారు.

 Indian Nri Lulu Groups Bumper Offer In Uae 50 Discount-TeluguStop.com

అందుకే అక్కడి ప్రభుత్వం ఆయనకు ఉన్నత పదవులు ఇచ్చి , గౌరవ ప్రదంగా భావించే గోల్డెన్ వీసాతో సత్కరించుకుంది.అయితే తన తెలివితేటలతో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన యూసఫ్ ఎంతో ఉన్నత స్థానాన్ని చేరుకున్నాడు.

లులు గ్రూప్ పేరుతో ఆయన పెట్టిన వ్యాపారాలు అన్నీ సక్సఫుల్ గా కొనసాగుతున్నాయి.

 Indian Nri Lulu Groups Bumper Offer In Uae 50 Discount-యూఏఈ లో భారత ఎన్నారై లులు గ్రూప్స్ బంపర్ ఆఫర్…50 శాతం డిస్కౌంట్….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా యూఏఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ సందర్భంగా యూసఫ్ అలీ తన లులు గ్రూప్స్ ద్వారా పలు రకాల ఉత్పత్తులపై 50 శాతం భారీ డిస్కౌంట్ ప్రకటించారు అది కూడా 50 రోజుల పాటు.

అక్టోబర్ 21 నుంచీ డిసెంబర్ 9 వరకూ ఈ ఆఫర్ అందుబాటులోకి ఉంటుందని లులు గ్రౌప్స్ తెలిపింది.యూఏఈ వ్యాప్తంగా సుమారు 87 స్టోర్స్ లలో 50 ప్రొడక్ట్స్ పై 50 శాతం డిస్కౌంట్ ఉంటుందని గ్రాసరీ, ఎలక్ట్రానిక్, ఫ్యాషన్, ఉత్పత్తులకు ఈ డిస్కౌంట్ ఉంటుందని సుమారు 50 రోజులపాటు ఇచ్చే ఈ డిస్కౌంట్ మేళా లో దాదాపు 4 వేల ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని లులు సంస్థ వెల్లడించింది.

లులు సంస్థ మార్కెటింగ్ అండ్ కమ్మ్యునికేషన్ డైరక్టర్ మాట్లాడుతూ రూ.2044 ఖర్చు చేసే దుఖాణ వ్యాపారస్తులు దాదాపు 2.5 కిలోల బంగారం గెలుచుకునే అవకాసం ఉందని ఈ లక్కీ డ్రాను డిసెంబర్ 2 న తీసి 50 మంది విజేతలను ప్రకటిస్తారు.డ్రాలో గెలుపొందిన వారికి ఒక్కొక్కరికి 50 గ్రాముల బంగారం బహుమతిగా అందిస్తారు.

అంతేకాదు పాత ఎలెక్ట్రానిక్ వస్తువులను మార్చుకుని కొత్తవి తీసుకువెళ్ళే ఆఫర్ కూడా ప్రకటించింది లులు గ్రూప్.ఇక భారతీయులు ఎంతో ఇష్టంగా జరుపుకునే దీపావళి పండుగను పురస్కరించుకుని లులు గ్రూప్ కొన్ని ప్రత్యేక ప్యాకేజీలు భారతీయుల కోసం అందించనున్నారట.

#Yusuf Ali #Golden Visa #IndianNRI #Yusuf #Lulu Company

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube