భారత సంతతి వ్యక్తికి అమెరికాలో కీలక పదవి...!!!

అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ ప్రముఖ వ్యాపార వేత్త, డెమోక్రటిక్ పార్టీ కీలక నేతగా,శాసన సభ్యుడుగా అమెరికాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న వ్యక్తి రాజా కృష్ణమూర్తి.ఈయనకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యంత్రాంగంలో అత్యంత కీలకమైన శాఖగా పరిగణించే ఇంటలిజెన్స్ కమిటీలో సభ్యుడిగా అవకాసం వచ్చినట్లుగా అమెరికా తెలుస్తోంది.

 Indian Nri Lawmaker Raja Krishnamoorthy In To American Intelligence-TeluguStop.com

అమెరికా జాతీయ భద్రతని మరింత బలోపేతం చేసేందుకు ఈ కమిటీ ఎంతగానో కీలకంగా వ్యవహరిస్తుంది.

ఇదిలాఉంటే ఈ విభాగంలో పనిచేయబోతున్న తొలి దక్షిణాసియా వ్యక్తిగా రాజా కృష్ణమూర్తి ఈ ఘనతని సాధించారు.ఈయన ఇల్లినాయిస్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.అయితే ఈయనతో పాటు ఇంటెలిజెన్స్‌‌పై హౌస్‌ సెలెక్ట్‌ కమిటీలో ఫ్లోరిడాకు చెందిన వాల్‌ డెమింగ్స్‌ అనే శాసన సభ్యురాలిని మరియు న్యూయార్క్‌కు చెందిన సేన్ పాట్రిక్‌ మలోనీ…వెర్మాంట్‌కు చెందిన పీటర్‌ వెల్చ్‌ అనే నలుగురు డెమోక్రటిక్‌ నేతలను నియమించారు.

ఈ కమిటీ ముఖ్య విధులు ఏమిటంటే.అమెరికాలో ఉన్న 17 ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీల పనితీరును.బడ్జెట్‌ను పర్యవేక్షించడం.అయితే కృష్ణ మూర్తిని అమెరికా ప్రతినిధుల స్పీకర్ అయిన డెమోక్రటిక్‌ నేత నాన్సీ పెలోసీ బుధవారం కృష్ణమూర్తిని ఈ కమిటీలో నియమించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube