అమెరికాలో భారతీయుడికి ఏడేళ్ళ జైలు శిక్ష..చేసిన తప్పేంటంటే...!!

అమెరికా వీసా మోసం కేసులో ఇండో అమెరికన్ ని అరెస్ట్ చేశారు.వాషింగ్టన్ లోని సియాటిల్ కోర్టు అతడికి ఏడేళ్ళ పైగా శిక్ష విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది.

 Indian Nri Kumar Samalarrested Forcheatingvisa-TeluguStop.com

వివరాలలోకి వెళ్తే.బెల్లెవ్యూ నగరానికి చెందిన రెండు ఐటీ కంపెనీలకి సిఈవో గా భారత ఎన్నారై కుమార్ సామల్ పని చేశారు.

ఆ కంపెనీల ముఖ్య ఉద్దేశ్యం ఏమింటే.ఐటీ ఉద్యోగులకి అమెరికాలోని వివిధ సాఫ్ట్ వేర్ కంపెనీలలో ఉద్యోగాలు కల్పించడం.

ఆ అవకాశాన్ని అడ్డుపెట్టుకుని కుమార్ సామల్ తప్పుడు వివరాలతో అమెరికాలో లేని భారతీయుల పేరిట హెచ్ 1 బీ వీసాలకి దరఖాస్తు చేశాడు.లాటరీలో వీసాలు పొందిన వారిని అమెరికాకి రప్పించి వారు దరఖాస్తులో పేర్కొన్న కంపెనీలలో కాకుండా వేరే కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం చేసేవాడు.

ఆ కంపెనీలో ఉద్యోగం లేకపోతే ఉద్యోగం వచ్చేవరకూ సెలవులు పెట్టించే వాడు.ఆ సమయంలో వారికి జీతం కూడా దక్కేది కాదు.ఇలా మోసాలు చేస్తూ ఒక్కొక్కరీ నుంచీ 3.50 లక్షలు వసూలు చేసేవాడు.

Telugu Green, Hb Visa, Kumar Samal, Telugu Nri Ups-

  ఈ క్రమంలోనే కుమార్ మొత్తం 250 మందికి పైగానే మోసం చేశారని తెలుస్తోంది.అంతేకాదు ఎంప్లాయ్ మెంట్ టాక్స్ కట్టకుండా దాదాపు కోట్ల రూపాయల మోసం చేస్తూ వచ్చాడని తెలియడంతో విచారణ చేపట్టిన ప్రభుత్వం అతడు చేసిన ఒక్కో మోసాన్ని బయటపెట్టింది.దాంతో పోలీసులు అదుపులోకి తీసుకుని మరింత లోతుగా విచారణ చెప్పత్తీ కుమార్ అక్రమాలు కోర్టు ముందు ఉంచారు.దాంతో స్థానిక కోర్టు అతడికి 7 ఏళ్ళకి పైగా జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube