యూఏఈ లోని భారతీయులకి...'ఆమ్నెస్టీ-2018'  

Indian Nri Gets Amnesty-2018 In Uae-

యూఏఈ లో ఎంతో మంది విదేశీయులు అక్రమంగా నివాసం ఉంటుంటారు ముఖ్యంగా అక్కడ అధికంగా భారతీయ వలస కార్మికులు ఎక్కువగా జీవనం సాగిస్తూ ఉంటారు.అయితే అక్కడ అక్రమంగా నివైస్తున్న వారికోసం యూఏఈ గతంలోనే ప్రవేశపెట్టిన ఆమ్నెస్టీ-2018’ ని ఉపయోగించుకుని తమ ప్రాంతాలకి వెళ్ళాలని యూఏఈ భారతీయులని అభ్యర్ధించింది.అయితే ఈ పధకం పథకం ప్రారంభమయి సగం కాలం పూర్తైంది..

Indian Nri Gets Amnesty-2018 In Uae--Indian NRI Gets Amnesty-2018 In UAE-

అయితే ఈ పరిణామాల నేపధ్యంలో దుబాయ్‌లోని “కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా” అధికారులు ఓ హెచ్చరిక ప్రకటన విడుదల చేశారు.ఆమ్నెస్టీ ద్వారా బయటపడాలనుకుంటున్నవారు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అక్కడి భారతీయులకు అభ్యర్థించారు.చివరి వరకూ వేచిచూసే ధోరణిలో ఉండటం అంత మంచి పద్దతి కాదని హెచ్చరించారు.

ఆమ్నెస్టీ పథకం ఆగస్టు 1 ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకూ సరైన పాస్‌పోర్టు లేని 1, 450 మంది ప్రవాస భారతీయులకు ఔట్‌పాస్ ఇచ్చామని దుబాయ్ ఎంబసీ అధికారులు తెలిపారు..

ఇదిలాఉంటే అబుదాబి ఎంబసీ ద్వారా 335 మంది ప్రవాస భారతీయులు తమ దేశం విడిచి వెళ్లారని తెలిపారు.ఱీ ఈ పధకాన్ని చివరి సమయంలో దరఖాస్తు చేద్దామని భావించేవారు ఉంటారని అందుకే ఆమ్నెస్టీ దరఖాస్తుదారుల సంఖ్య ఎంతనేది ఇప్పటి వరకూ చెప్పలేమని చివరి నిమిషంలో దరఖాస్తు దారుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.