ఇండియాలో మహిళల రక్షణకై ఎన్నారైల...'అయ్యప్ప దీక్ష'..!!!

సజహంగా అయ్యప్ప దీక్ష ఎందుకు వేసుకుంటారు.మన కష్టాలు తొలగి పోవాలని, అనుకున్న కోరికలు నెరవేరాలని, మాంచి ఇల్లు కట్టుకుంటే మాల వేసుకుంటానని ఇలా తమ వ్యక్తిగత విషయాలకోసం దీక్షలు చేస్తారు, మొక్కులు మొక్కుతారు.

 Indian Nri Ayyappa Deeksha About Indian Womens-TeluguStop.com

కానీ అమెరికాలోని కొందరు తెలుగు ఎన్నారైలు మాత్రం అందరిలా ఆలోచన చేయలేదు.దేశంలో మహిళలకి రక్షణ కరువవుతోందంటూ, మహిళలపై అకృత్యాలు ఆగిపోవాలంటూ అయ్యప్ప దీక్ష చేపట్టారు.

వివరాలలోకి వెళ్తే.

అమెరికాలోని నార్త్ కరోలినా , సౌత్ కరోలినా రాష్ట్రాలకి చెందిన సుమారు 100 మంది ఎన్నరైలు అయ్యప్ప మాల ధరించి 41 రోజుల దీక్షని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు.

దీక్ష విరమించే రోజున స్థానికంగా ఉన్న శిరిడీ సాయి ఆలయంలో ఇరుముడి ధరించి బస్సు ప్రయాణం ద్వారా సుమారు 9 గంటలు ప్రయాణించి ఫ్లోరిడాలోని తాంపా లో అయ్యప్ప స్వామి ఆలయంలో దీక్షని విరమించారు.

Telugu Nriayyappa, Telugu Nri Ups-

అయ్యప్ప మందిరానికి వెళ్ళే క్రమంలో సుమారు 2 గంటలు కాలి నడక నడిచి పడి మెట్లు ఎక్కి, భజనలు, పేటతుళ్ళి ఆడుతూ దీక్షని విరమించారు.దీక్షలో పాల్గొన్న వారిలో 20 మంది చిన్నారు లు కూడా ఉన్నారు.పాల్గొన్నారు.

దీక్ష విరమణ అనంతరం మాట్లాడన తెలుగు ఎన్నరైలు భారత దేశంలో, తెలుగు రాష్టాలలో మహిళలపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని , మహిళలపై దాడులు జరగకుండా చూడమని ఆ అయ్యప్పని వేడుకున్నమని అందుకే మాలధారణ చేశామని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube