అమెరికాలో డిప్యూటి మేయర్ గా భారత సంతతి మహిళ...  

అమెరికా వంటి అగ్ర రాజ్యంలో భారత సంతతి వ్యక్తులకి కొదవే లేదు. అధిక శాతం అమెరికాకి వలసలు వెళ్లి స్థిరపడిన వారిలో భారతీయులే అత్యధికంగా ఉన్నారు. అంతేకాదు అనేక కీలక పదవుల్లో కొనసాగుతున్నారు కూడా. కేవలం ఉద్యోగ వ్యాపార రంగాలలోనే కాదు రాజకీయరంగంలో సైతం అత్యంత కీలకంగా భారతీయులు ఉండటం గమనార్హం అయితే

Indian NRI As A American Deputy Mayor Nepali Ranganathan-Indian Nri Nepali Ranganathan Nri Telugu News Updates

Indian NRI As A American Deputy Mayor Nepali Ranganathan

తాజాగా అమెరికాలో డిప్యూటీ మేయర్‌గా తమిళనాడుకు చెందిన ప్రవాస భారతీయ మహిళ ఎన్నికయ్యారు. ఆమె పేరు షెపాలి రంగనాథన్‌(38) , సీటిల్‌ నగర డిప్యూటీ మేయర్‌గా ఆమె ఎన్నిక కావడం జరిగింది. అంతేకాదు ఆమె ఒక స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ గా కూడా తన సేవలని కొనసాగిస్తున్నారు. షెపాలి తల్లి తండ్రులు చెన్నై లోనే ఉంటున్నారు.

షెపాలి అన్నా యూనివర్సిటీ లో ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌లో గోల్డ్ మెడల్ కూడా సాధించి ఎంతో గుర్తింపు పొందారు. దాంతో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళారు. అమెరికాలో అనేక స్వచ్చంద సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండే షెపాలి కి మేయర్ గా ఆమె ఎన్నిక కావడం భారతీయులకి ఎంతో గర్వకారణమని పలువురు ఎన్నారైలు సంతోషాన్ని వ్యక్తం చేశారు.