అమెరికాలో విదేశీయులకి జారీ చేసే వృత్తి నైపుణ్య వీసా హెచ్ -1 బి పై అమెరికా ఇమ్మిగ్రేషన్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది.ఈ వీసాలో జారీ విషయంలో పాటించే నిభందనలు కూడా ఎంతో ఖటినమైనవి గా ఉంటాయి.
అంతేకాదు ఈ వీసాలని పొందలేని వాళ్ళు, అమెరికాలో ప్రవేసించాలని అనుకునే వాళ్ళు కొంతమంది అక్రమ మార్గాల ద్వారా అమెరికాలో ప్రవేశిస్తూ ఉంటారు.
ఇలా అక్రమ మార్గాల ద్వారా అమెరికాలో ప్రవేశాలకి వీలు కల్పిస్తూ హెచ్-1 బీ వీసాలలో మోసాలు చేస్తున్న నలుగురు తెలుగు ఎన్నారైలని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు.
వీరిలో న్యూజెర్సీ కి చెందినా విజయ్ మానే, మననం వెంకట రమణ, ఫెర్నాండో సెల్వా లతో పాటుగా కాలిఫోర్నియా కి చెందిన వేమూరి సతీష్ కూడా ఉన్నారు.ఐటి ఉద్యోగ నియామక సంస్థలకి చెందిన ఈ నలుగురు వ్యక్తులు
హెచ్-1బి వీసాలలో తీవ్ర స్థాయిలో దుర్వినియోగం చేశారని, అమెరికా అటార్నీ ఆరోపించింది.ఈ మేరకి వీరిపై అభియోగాలు నమోదు చేసినట్లుగా అమెరికా ఇమ్మిగ్రేషన్ న్యాయమంత్రిత్వ శాఖ వెల్లడించింది.దాంతో వీరు 2.5 లక్షల డాలర్ల పూచి కత్తుపై బెయిల్ పై విడుదల అయినట్టుగా స్థానిక మీడియా వెల్లడించింది.నేరం రుజువైతే వీరికి ఐదేళ్ళ జైలు శిక్ష తో పాటు ఒక్కొక్కరు 2.5 లక్షల డాలర్లు చెల్లించవలసి ఉంటుందని అధికారులు తెలిపారు.