అమెరికా: టెక్ సపోర్ట్ స్కామ్‌లో భాగం.. భారత సంతతి యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష..?

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికాకు వలస వెళ్లిన భారతీయులు అక్కడి అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే.ఏకంగా అమెరికాలో రెండవ శక్తివంతమైన పదవిలో భారతీయురాలు వుండటం మనందరికీ గర్వకారణం.

 Indian National Pleads Guilty To Tech Support Refund Scam , Tech Support Refund-TeluguStop.com

కానీ కొందరు అక్రమార్కులు చేస్తున్న పనుల వల్ల భారతీయులు అప్రతిష్టను మూటగట్టుకుంటున్నారు.హ్యూస్టన్‌లో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న ఓ 27 ఏళ్ల భారతీయుడు దేశవ్యాప్తంగా టెక్ సపోర్ట్ రీఫాండ్ స్కామ్‌లో పాలుపంచుకున్నట్లు తన నేరాన్ని అంగీకరించాడు.

సుమిత్ కుమార్ సింగ్ అనే యువకుడు 2018-2020 మధ్యకాలంలో జరిగిన స్కామ్‌లో కీలకపాత్ర పోషించినట్లు అధికారులు గుర్తించారు.ఈ నేరానికి సంబంధించి అతనికి 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం వుంది.

దీనితో పాటే 2,50,00 డాలర్ల జరిమానా విధించే అవకాశం వుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.సుమిత్ కేసుపై డిసెంబర్ 20న విచారణ జరగనుంది.కోర్టుకు సమర్పించిన పత్రాల ప్రకారం.వెస్ట్రన్ యూనియన్, మనీగ్రామ్, మనీ ట్రాన్స్‌మీటర్ ద్వారా వీరు మోసాలకు పాల్పడినట్లు తేలింది.

బాధితుల కంప్యూటర్లకు రిమోట్ యాక్సెస్ పొందడానికి కంప్యూటర్ టెక్నికల్ సపోర్ట్ సేవలను అందిస్తామంటూ వీరు మోసపూరిత స్కీములను ప్రవేశపెట్టినట్లు ప్రాసిక్యూటర్లు తెలిపారు.

ఇక మరో కేసులో అమెరికాలోని పెన్సిల్వేనియాకు చెందిన ఒక భారతీయ అమెరికన్ 2 మిలియన్ డాలర్ల విలువైన పీపీఈ కిట్లకు సంబంధించిన మోసానికి పాల్పడ్డట్టు నేరాన్ని అంగీకరించినట్లు యూఎస్ అటార్నీ తెలిపారు.

గౌరవ్‌జిత్ సింగ్ (26) యూఎస్ జిల్లా కోర్టు న్యాయమూర్తి పీటర్ జీ.షెరిడాన్ ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన విచారణలో తన నేరాన్ని ఒప్పుకున్నాడు.ఇందుకు శిక్షగా గౌరవ్‌జిత్ గరిష్టంగా 20 సంవత్సరాల జైలు శిక్ష 2,50,000 డాలర్ల జరిమానా లేదా రెండూ ఎదుర్కోవచ్చు.లేని పక్షంలో మోసపూరితంగా అతను సంపాదించిన దానికి రెట్టింపు మొత్తాన్ని చెల్లించాలని కోర్టు ఆదేశించవచ్చు.2022 ఫిబ్రవరి 10న గౌరవ్‌జిత్‌కు శిక్ష ఖరారుకానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube