ముద్దు పెట్టుకున్నాడు.. ఏడు నెలలు జైలు శిక్ష.. చివరికి?

ఏంటి ముద్దు పెట్టుకుంటే జైల్లోకి వేస్తారా? ఇదెక్కడి న్యాయం అని మీకు అనిపించచ్చు.కానీ ఇందులో కూడా ఒక తిరకాసు ఉంది.ఎవరైనా సరే చిన్న పిల్లలకు, భార్యకు, చెల్లికి ముద్దు పెడితే పర్వాలేదు.26 ఏళ్ళ వ్యక్తి ఆన్లైన్ చాటింగ్ చేసి 15 ఏళ్ల అమ్మాయికి ముద్దు పెడితే జైల్లో వెయ్యకుండా వూరికే ఉండరు కదా.హ అలానే ముద్దు పెట్టాడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు నెలలు జైలు శిక్ష అనుభవించాడు.సాధారణంగా మన భారత్ లో అత్యాచారాలు చేసిన కొందరు బెయిల్స్ తీసుకొని బయటకు వస్తారు అలాంటిది ముద్దు పెట్టుకుంటే అది అసలు శిక్ష కిందికి కూడా తీసుకోరు అని అంటుంటారు.

 Indian Origin Jailed For Kissing Minor, Singapore, Indian National Jailed, Seven-TeluguStop.com

కానీ ఇతర దేశాలలో అలా ఉండదు.ఆడపిల్లకు ఇష్టంలేకుండా ఏది చేసిన శిక్షే.
ఇక అలానే పూర్తి వివరాల్లోకి వెళ్తే.సింగపూర్‌లో నివసిస్తున్న చెల్లం రాజేశ్‌ కన్నన్‌ అనే భారతీయుడు ఫేస్ బుక్ ద్వారా సింగపూర్ కి చెంది ఒక 15 ఏళ్ల అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు.

ఇక ఆ అమ్మాయి కాస్త గత సంవత్సరం ఆగస్టులో మొదటిసారి కలిసింది.అలా కలిసిన ఆ అమ్మాయి కొద్దీ రోజులకు తన స్నేహితులకు మద్యం కావాలని రాజేష్ ని అడగగా అతను తెస్తాను అని చెప్పి ఆమెను ముద్దు అడిగాడు.

ఆమె అందుకు ఒప్పుకోలేదు.అయినప్పటికీ బలవంతం చేసి.

అతడు హద్దులు మీరి ప్రవర్తించాడు.
దీంతో అతడిపై ఆమె పోలీసు కేసు పెట్టగా అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు ఏడు నెలలు శిక్ష పడేలా చేశారు.

ఇక విచారణ చేసే సమయంలో అతడు అలా చేసినందుకు చాలా సిగ్గు పడుతున్నట్టు పశ్చాత్తాప పడుతున్నాని.ఈ పని వల్ల కుటుంబాన్ని కోల్పోయానని.ఉద్యోగాన్ని కోల్పోయానని వాపోయాడు.నిందితుడు శిక్ష ఒప్పుకున్నందు వల్ల అతడికి ఏకంగా 7 నెలలు జైలు శిక్ష విధించారు.

ఈ విషయంపై కామెంట్లు చేసే నెటిజన్లు.మరోసారి ముద్దు అంటే బెదిరిపోతారు అంటూ కామెంట్లు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube