మరో తెలుగు “ఎన్నారై మృతి”       2018-05-29   23:47:23  IST  Bhanu C

అమెరికాలో వరుసగా జరుగుతున్న ఎన్నారైల మరణాలు అక్కడి ఎన్నారైలని ఎన్నారైల భండువులని తెగ కంగారు పెడుతున్నాయి..దేశం కాని దేశం వెళ్లి అందరిని విడిచి కెరియర్ కోసం వెళుతున్న వారు అక్కడ తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోక పోవడం వలన ప్రమాద వశాత్తు చనిపోవడం ఎంతో భాదాకరమైన విషయం కొన్ని రోజుల క్రితం భారత ఎన్నారై స్టూడెంట్ ఒక కొండపైకి ఎక్కి సేల్ఫీ తీసుకుంటూ సముద్రంలో పడి మరణించిన సంఘటన మరువక ముందే మరొక మరణ వార్త వినాల్సి వచ్చింది..వివరాలలోకి వెళ్తే..

తన స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు వెళ్లిన ఓ తెలుగు వ్యక్తి∙ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన కాలిఫోర్నియాలోని యోస్‌మైట్‌ నేషనల్‌ పార్క్ లో చోటు చేసుకుంది..ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆశిష్‌ పెనుగొండ(29) న్యూయార్క్‌లో ఉంటున్నారు. ఈనెల 21న ఆశిష్‌ స్నేహితులతో కలిసి నేషనల్‌ పార్క్ కి వెళ్ళాడు..అక్కడే ఉన్న హాఫ్‌డోమ్‌ అనే గ్రానైట్‌ కొండను తోటి వారితో కలిసి ఎక్కేందుకు ప్రయత్నించారు.

-

అయితే ఈ కొండ బయా ఎత్తుగా ఏటవాలుగా ఉండటం మరియూ జారిపోతూ రెండు చేతులతో తాళ్లు పట్టుకుని నడుస్తూ ఎక్కుతుండగా ఒక్కసారిగా గాలివాన మొదలైంది. ఆ క్రమంలోనే ఆశిష్‌ కాలుజారి కొండపై నుంచి కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఆశిష్‌ అక్కడికక్కడే చనిపోయారు…అయితే ఆశిష్ ఫెయిర్లీ డికిన్సన్‌ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్‌ చేశాడు న్యూజెర్సీలోని న్యూమిల్‌ఫోర్డ్‌ కేంద్రంగా ఉన్న సీమెన్స్‌ హెల్త్‌కేర్‌ కంపెనీలో బయోకెమిస్ట్‌గా పనిచేస్తున్నారు…అయితే ఆశిష్ మృతి పట్ల ఎన్నారై లు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు..

-

ప్రమాదంలో తన జీవితాన్ని కోల్పోయిన ఆశిష్‌ పెనుగొండ(29) కుటుంబ సభ్యులకు మా సంపూర్ణ సంతాపం.తెలుగు NRI తరుపున మా విన్నపము : ఈ మధ్యన మనము చానా బాధాకరమైన వార్తలు వింటున్నాము ..తగు జాగ్రత్తలు తీసుకోవాలిసిందిగా మా విన్నపము.

-
-