అమెరికా యూనివర్సిటీ భారతీయుడి భారీ విరాళం...!!  

Indian Mathematician Wife Give 1 Million Dollrs To Us University-srinivasa Ramanujan,vs Varadarajan Wife Indian Origin Mathematician

అమెరికాలోని ప్రఖ్యాత యూనివర్సిటీ అయిన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా కి భారత సంతతి దంపతులు దాదాపు 7 కోట్లు విరాళంగా ప్రకటించారు. ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త రామానుజన్ పేరిట సదరు యూనివర్సిటీ లో గణిత విభాగంలో ప్రొఫెసర్‌షిప్‌ను ప్రారంభించడం ఈ భారీ విరాళం అందించినట్టుగా వారు తెలిపారు...

అమెరికా యూనివర్సిటీ భారతీయుడి భారీ విరాళం...!!-Indian Mathematician Wife Give 1 Million Dollrs To Us University

గణిత శాస్త్రానికి ఎనలేని సేవలు చేసిన భారతీయుడు శ్రీనివాస్ రామానుజన్ పై ఉన్న గౌరవం తోనే తాము ఈ పని చేస్తున్నామని అదే యూనివర్సిటీ లో పని చేస్తున్న వరదరాజన్ తెలిపారు. విజిటింగ్‌ ప్రొఫెసర్‌షిప్‌ను ప్రారంభించడానికి ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త వరదరాజన్‌, ఆయన భార్య వేద పూనుకున్నారని అధికారులు చెప్పారు.

అయితే వర్సిటీ ఆమోదం తెలిపిన తరువాతే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని అధికారులు తెలిపారు. ఈ ఏడాది డిసెంబరులో జరగనున్న వర్సిటీ శత వార్షికోత్సవాల్లో భాగంగా దీనిని ప్రారంభిస్తామని అధికారులు చెప్పారు. యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో గణిత శాస్త్రంలో ప్రొఫెసర్ గా పని చేస్తున్న వరదరాజన్ మద్రాసు వర్సిటీలో ఎమ్మెల్సీ , కలకత్తా లో పీహెచ్.డీ చేశారు.