మళ్లీ అమెరికన్ స్టోర్‌లలోకి భారతీయ మామిడి రకాలు ‘‘ దస్సేరీ , లాంగ్డా ’’...!!

వేసవి కాలమంటేనే భరించలేని వేడి.ఇంట్లో ఉక్కపోత.

 Indian Mangoes Like Dussehri & Langda May Again Find Space In American Stores ,-TeluguStop.com

కానీ అందరి దృష్టి మామిడి పండ్లపైనే ఉంటుంది.ఎందుకంటే నోరూరించే తియ్యతియ్యటి మామిడిపండ్లు దొరికే సీజన్ ఇదే కదా.ఎండాకాలం వచ్చిందంటే చాలు.మార్కెట్లలో, రహదారుల పక్కన, సూపర్‌ మార్కెట్లలో, పండ్ల దుకాణాల్లో.

ఇలా ఎక్కడ చూసినా మామిడి పండ్లే దొరుకుతాయి.పసుపు రంగులో మెరిసిపోయే వాటిని చూడగానే.

ఎవరికైనా తినాలనిపిస్తుంది కదా.అంతేకాదు ప్రేమకు, సంపదకు, సంతానాభివృద్ధికి ప్రతీక మామిడిని భారతీయులు భావిస్తారు.జీవితానికి అతి ముఖ్యమైన ఈ మూడింటినీ అందించే మొక్కగా మామిడిని పూజిస్తారు .రామాయణం, మహాభారతం వంటి గ్రంథాలతోపాటు ఇతర పురాణాల్లో కూడా మామిడి మొక్కల ప్రస్తావన ఉంది.మామిడాకులు లేకుండా ఏ శుభకార్యమూ జరగదు.అంతేకాదు.మామిడి పండు భారతదేశపు జాతీయ ఫలం.

బంగినపల్లి, ఆల్ఫాన్సో, హిమాయుద్దీన్, తోతాపురి, దశహరి, సువర్ణరేఖ, నీలం, కొబ్బరిమామిడి, మల్లిక, ఆమ్రపాలి, లాంగ్డా, అర్క అరుణ, బాంబే గ్రీన్, పంచదార కలశ, నీలం, చందూరా, రుమానియా, మల్గోవా, చక్కెర కట్టి, గిర్ కేసర్ మామిడి, చిన్న రసాలు, పెద్దరసాలు, చెరుకురసాలు, నూజీవీడు రసం, కోలంగోవా, ఏండ్రాసు, కలెక్టరు, కొండమామిడి, ఇమాం పసంద్, దసేరి, జహంగీర్, దిల్‌పసంద్, నూర్జహాన్, బేనీషా, హిమానీ, నీలిషాన్, ఆచారి, జలాలు.ఇలా వందలాది రకాల మామిడి పళ్లు భారతదేశంలో పండుతాయి.అయితే గ్లోబలైజేషన్ పుణ్యమా అని ప్రపంచం ఒక కుగ్రామంగా మారడంతో ఏ దేశంలోని ఫలాలు, రుచులైనా ఇతర దేశాల్లో దొరుకుతున్నాయి.

అదే కోవలో మన మామిడి పండ్లు విదేశాలకు సైతం ఎగుమతి అవుతాయి.ప్రపంచంలోని 40 దేశాలకు భారతీయ మామిడి ఎగుమతి అవుతుంది.

ఇక అసలు విషయంలోకి వెళితే.భారత్‌–అమెరికా ట్రేడ్‌ పాలసీ ఫోరం (టీపీఎఫ్‌) 12వ మంత్రుల స్థాయి సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఇరు దేశాల మధ్య ఎగుమతి, దిగుమతుల పరిధిలోకి మరిన్ని ఉత్పత్తులను చేర్చడంపై దృష్టి సారించాయి.ఈ ప్రయత్నాలు ఫలవంతమైతే భారత్‌ నుంచి అమెరికాకు మామిడి, దానిమ్మ ఎగుమతి చేయడానికి, అక్కడి నుంచి చెర్రీ పళ్లను దిగుమతి చేసుకోవడానికి వీలు కానుంది.

ఇందుకు సంబంధించిన విధి విధానాలపై కసరత్తు చేయాలని మంగళవారం జరిగిన భేటీలో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్, అమెరికా ట్రేడ్‌ రిప్రెజెంటేటివ్‌ (యూఎస్టీఆర్‌) కేథరిన్‌ టై అంగీకరించారు.అలాగే ఇతర అంశాలను కూడా వారు చర్చించారు.

Telugu Catherine, Goyal, Indiatrade, Indianmangoes, Piyush Goyal-Telugu NRI

ఈ ఆర్ధిక సంవత్సరంలో భారత్- అమెరికాల మధ్య వాణిజ్యం 100 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని గోయల్, కేథరిన్‌ అభిప్రాయపడ్డారు.వాణిజ్యానికి అడ్డంకులను తొలగించేందుకు మరిన్ని అంశాలపై కలిసి పనిచేయాలని ఇద్దరూ తీర్మానించారు.అటు, దేశీ ఎగుమతిదారులకు ప్రాధాన్య హోదా (జీఎస్‌పీ) ప్రయోజనాలను పునరుద్ధరించాలని సమావేశం సందర్భంగా అమెరికాను భారత్‌ కోరింది.దీన్ని పరిశీలిస్తామంటూ అమెరికా హామీ ఇచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube