పేరుకు క్లీనింగ్... చెత్తబుట్టలో దొంగసొమ్ము : దుబాయ్‌లో భారతీయుడికి జైలు శిక్ష

దొంగతనానికి పాల్పడినందుకు గాను ఓ భారతీయుడికి దుబాయ్ కోర్టు ఏడాది జైలు శిక్షను విదించింది.నగరంలోని ప్రఖ్యాత గోల్డ్ సౌక్‌లోని వాచ్‌లు ఆభరణాలు విక్రయించే దుకాణంలో క్లీనర్‌గా పనిచేస్తున్న 26 ఏళ్ల భారతీయుడు 86 వాచ్‌లను దొంగతనం చేశాడు.

 Indian Man Sentenced To 1 Year In Dubai For Stealing 86 Watches-TeluguStop.com

వీటి విలువ 2 మిలియన్ డాలర్లకు పైనే ఉంటుందని అంచనా.ఇతనితో పాటు దొంగిలించబడిన వాచ్‌లను విక్రయించేందుకు సాయం చేసిన ఇద్దరు పాకిస్తానీయులకు న్యాయస్థానం చెరో ఏడాది జైలు శిక్ష విధించింది.

కారాగార వాసం పూర్తయిన తర్వాత ఈ ముగ్గురిని దేశం నుంచి బహిష్కరించాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు.

గతేడాది డిసెంబర్‌ 25న నిందితుడు పనిచేస్తున్న దుకాణంలోని చెత్తబుట్టలో 30 వేల డాలర్ల విలువైన వాచ్‌ను సేల్స్‌మెన్ గుర్తించి యజమాని దృష్టికి తీసుకొచ్చారు.

ఆ తర్వాత షాపు యజమాని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా సదరు క్లీనర్ శుభ్రం చేస్తున్నట్లుగా నటిస్తూ, వాచ్‌ను దొంగిలించాడు.అనంతరం దానిని పెట్టేలో పెట్టి చెత్తబుట్టలో వేసినట్లు గుర్తించారు.

అందువల్ల దొంగిలించిన వాచ్‌ను క్లీనర్ సులభంగా బయటకు తీసుకెళ్లగలడని నిర్థారించారు.

Telugu Watches, Dubai, Dustbin, Indian, Indiansentenced, Steal Watches, Telugu N

దీనిపై షాపు యజమాని నిందితుడిని నిలదీయగా తాను 2,50,000, 2,70,000 దిర్హామ్‌లు విలువ చేసే రెండు వాచ్‌లను దొంగిలించానని అంగీకరించాడు.వీటిలో ఒక్కొక్క దానిని 10 వేల దిర్హామ్‌‌లకు ఓ పాకిస్తానీకి విక్రయించానని చెప్పాడు.అయితే రెండవ వాచ్‌కు సంబంధించి ఇంకా అతని వద్ద నుంచి డబ్బు అందలేదని నిందితుడు చెప్పాడు.

దొంగతనానికి సంబంధించి షాపు యజమాని జనవరి 6న నైఫ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.ప్రాసిక్యూషన్ విచారణలో భారతీయుడు తన దొంగతనాన్ని అంగీకరించడంతో కోర్టు శిక్ష విధించింది.

ఈ తీర్పుకు సంబంధించి 15 రోజుల్లోగా అతను అప్పీల్ చేసుకోవచ్చునని న్యాయమూర్తి తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube