భార్యను చంపిన భర్త: భారతీయుడికి జీవితఖైదు విధించిన దుబాయ్ కోర్టు

అనుమానంతో ముందు వెనుక ఆలోచించకుండా భార్యను హతమార్చిన భారతీయుడికి దుబాయ్ కోర్టు జీవిత ఖైదు విధించింది.కేరళకు చెందిన విద్యా చంద్రన్, యుగేష్ దంపతులు.

 Indian Man Sentenced To Life For Stabbing Wife To Death In Dubai, Dubai Court, I-TeluguStop.com

విద్య తన పిల్లలతో కలిసి దుబాయ్‌లో జీవిస్తున్నారు.ఈ క్రమంలో గతేడాది సెప్టెంబర్ 9న విద్యను భర్త యుగేశ్ ఆమె ఆఫీసులో పార్కింగ్ ప్రదేశంలోనే కత్తితో పొడిచి చంపాడు.

ఈ కేసుకు సంబంధించి యుగేశ్‌ను అదే రోజు జెబెల్ అలీలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

విచారణ సందర్భంగా విద్యకు తన ఆఫీసులో ఎవరితోనో అక్రమ సంబంధం వుందని.

ఈ కారణంగానే తన భార్యను హత్య చేసినట్లు పోలీసులకు యుగేశ్ తెలిపాడు.అక్రమ సంబంధానికి సంబంధించి ఆఫీసులోని మేనేజర్ తనకు మెసేజ్ పెట్టినట్లు చెప్పుకొచ్చాడు.

ఈ కేసులో నేరస్తుడు తన నేరాన్ని అంగీకరించడంతో దుబాయ్ కోర్ట్ యుగేశ్‌కు జీవితఖైదు విధించింది.జూలై 20 నుంచి 15 రోజుల్లోగా ఈ తీర్పుపై అప్పీలు చేసుకునేందుకు గడువు విధించింది.

Telugu Vidya Chandran, Dubai, Indian, Indiansentenced-

న్యాయస్థానం తీర్పుపై విద్య సోదరుడు వినయ్ చంద్రన్ స్పందిస్తూ… తాము యుగేశ్‌కు మరణశిక్ష ఆశించామని, కానీ జీవితఖైదును విధిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పును ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.విద్యను యుగేశ్ తరచూ వేధించేవాడని, కానీ ఆమె తన కుమార్తెల కోసం అన్నింటినీ భరించిందని విద్యా చంద్రన్ స్నేహితుడు చెప్పాడు.యుగేశ్ తన విజిటింగ్ వీసాపై దుబాయ్ వచ్చి ఆమెను హతమార్చినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube