దుబాయ్: భార్యను కాపాడేందుకు మంటల్లో దూకి, మృత్యువుతో భారతీయుడి పోరాటం  

Indian Man In Uae Suffers 90 Per Cent Burns While Trying To Save Wife - Telugu 90 Per Cent Burns, Anil Ninan, Fire Accident, Indian Man, Nri, Telugu Nri News, Trying To Save Wife, Uae

అగ్నిప్రమాదం నుంచి భార్యను కాపాడే ప్రయత్నంలో భర్త ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.భారత్‌లోని కేరళకు చెందిన అనిల్ నినాన్, నీను దంపతులు తమ నాలుగేళ్ల కొడుకుతో కలిసి దుబాయ్‌లోని ఉమ్ అల్ క్వైన్‌లోని అపార్ట్‌మెంట్‌‌లో నివసిస్తున్నారు.

Indian Man In Uae Suffers 90 Per Cent Burns While Trying To Save Wife - Telugu 90 Per Cent Burns, Anil Ninan, Fire Accident, Indian Man, Nri, Telugu Nri News, Trying To Save Wife, Uae-Telugu NRI-Telugu Tollywood Photo Image

ఈ క్రమంలో సోమవారం రాత్రి వీరి అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది.అగ్నికీలలు ఎగిసిపడుతుండగా నీను కారిడార్‌లో చిక్కుకుపోయింది.బెడ్‌రూమ్‌లో నిద్రపోతున్న అనిల్ భార్య అరుపులు విని కారిడార్ వద్దకు పరిగెత్తికెళ్లి ఆమెను రక్షించాడు.అయితే ఈ ప్రయత్నంలో అనిల్‌కు తీవ్రగాయాలయ్యాయి.

వెంటనే స్పందించిన స్థానికులు అతనిని తొలుత ఉమ్ అల్ క్వాయిన్‌లోని షేక్ ఖలీఫా జనరల్ ఆసుపత్రికి, అక్కడి నుంచి అబుదాబిలోని మాఫ్రాక్ హాస్పిటల్‌కు తరలించారు.

90 శాతం శరీరం కాలిపోవడంతో ప్రస్తుతం అతను ప్రాణాలతో పోరాడుతున్నట్లు వైద్యులు తెలిపారు.అనిల్ భార్య నీను కూడా స్వల్ప గాయాలు కావడంతో అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

ఉమ్ అల్ క్వాయిన్‌లోని అపార్ట్‌మెంట్ కారిడార్‌లో ఉన్న ఎలక్ట్రిక్ బాక్స్ నుంచి షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు సంభవించి ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు.

తాజా వార్తలు

Indian Man In Uae Suffers 90 Per Cent Burns While Trying To Save Wife-anil Ninan,fire Accident,indian Man,nri,telugu Nri News,trying To Save Wife,uae Related Telugu News,Photos/Pics,Images..