అమెరికాలో భారతీయుడికి యావజ్జీవం..!!  

Indian Man Gets Lifetime Imprisonment In Us-deepak Deshpande,florida Girl,indo American

అమెరికా కోర్టు 41 ఏళ్ళ దీపక్ దేశ్ పాండే అనే వ్యక్తికి యావజ్జీవ శిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది.దాంతో కోర్టు తీర్పుపై అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.ఇంతకీ అతడు చేసిన నేరం ఏమిటంటే.

కాలిఫోర్నియాలోని ఉంటున్న భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి దీపక్ ఫ్లోరిడాకు చెందిన ఓ అమ్మాయితో 2017లో ఆన్‌లైన్‌ చాటింగ్‌ ద్వారా సన్నిహితుడయ్యాడు.

ఆ తర్వాత పోర్న్‌ వీడియోలు పంపాలంటూ ఆమె నిత్యం వేధించేవాడు.అయితే ఎఫ్‌బీఐ ఏజెంట్లు ఓ అండర్‌కవర్‌ ఆపరేషన్‌ ద్వారా దేశ్‌పాండే అకృత్యాలను పసికట్టారు.

అమెరికాలో భారతీయుడికి యావజ్జీవం..!!-Indian Man Gets Lifetime Imprisonment In US

దాంతో ఒక్కసారిగా అన్ని సాక్ష్యాధాాలతో అతడిని పట్టుకున్నారు.పోలీసులకి చిక్కిన తరువాత ఆమెని చంపడానికి వ్యూహం కూడా రచించాడు.

అది వర్కౌట్ కాలేదు. సుదీర్ఘ విచారణ వాదనలను పరిశీలించిన కాలిఫోర్నియా కోర్టు జడ్జి కార్లో మెండోజా లైంగికంగా ప్రేరేపించినందుకు అతడికి జీవితకాల శిక్ష తో పాటు 30 ఏళ్ల అదనపు శిక్షను ఖరారు చేశారు.