దుబాయ్: పాకిస్తానీయుల ఘాతుకం... భారతీయుడిని చితక్కొట్టి చోరీ  

దుబాయ్‌లో దారుణం జరిగింది.భారతీయుడిపై ముగ్గురు పాకిస్తానీయులు దాడి చేసి చోరీకి పాల్పడ్డారు.

TeluguStop.com - Indian Man Attacked By Three Mask Wearing Pakistani Burglars In Uae

వివరాల్లోకి వెళితే… ఈ ఏడాది ఆగస్టులో బుర్ దుబాయ్ ప్రాంతంలోని ఓ విల్లాలోకి చోరబడిన దుండగులు అక్కడి నివాసితులపై ఇనుప రాడ్‌లతో దాడి చేసి విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు.ఈ క్రమంలో మెడికల్ మాస్క్‌లు ధరించిన ముగ్గురు పాకిస్తానీయులు సదరు భారతీయుడి ఇంటిలోకి చొరబడ్డారు.

అతనిని బంధించి ముఖానికి ప్లాస్టిక్ సంచిని తొడిగి, నోటిపై ప్లాస్టర్ అతికించారు.వీరిలో ఒకరు భారతీయుడిని పట్టుకోగా.

TeluguStop.com - దుబాయ్: పాకిస్తానీయుల ఘాతుకం… భారతీయుడిని చితక్కొట్టి చోరీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

మరొకరు అతనిని మెటల్ బార్ (లోహపు కడ్డీ)తో తీవ్రంగా కొట్టారు.

వీరిని ప్రతిఘటించేందుకు బాధితుడు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు.

అయితే దుండగుల్లో ఒకరి ముఖాన్ని భారతీయుడు చూడగలిగాడు.ఇతనిని గదిలో పడేసిన అగంతకులు ల్యాప్‌టాప్, మొబైల్, నగదు, క్రెడిట్ కార్డులను దొంగతనం చేశారు.

ఎట్టకేలకు ముఖానికి ప్లాస్టిక్ కవర్, నోటికి ప్లాస్టర్ తొలగించుకుని బయటపడిన భారతీయుడు.రూమ్‌మేట్స్ సాయంతో వారిని వెంబడించినప్పటికీ దుండగులు చిక్కలేదు.

అయితే దొంగల్లో ఒకరిని బాధితుడు చూసినందున అతనిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ కేసుకు సంబంధించి ఆదివారం దుబాయ్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌‌స్టాన్స్‌లో విచారణ జరిగినట్లు గల్ఫ్ న్యూస్ కథనాన్ని ప్రచురించింది.

అయితే దుబాయ్‌లో పాక్ జాతీయులు .భారతీయులను టార్గెట్ చేసి చోరీకి పాల్పడిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.గతేడాది నవంబర్ 30న దుబాయ్‌లో నివసిస్తున్న 32 ఏళ్ల భారతీయ మహిళ స్థానికంగా ఉన్న క్లినిక్ నుంచి రాత్రి 10 గంటల ప్రాంతంలో తన ఇంటికి తిరిగి వెళ్తోంది.ఈ సమయంలో 23 ఏళ్ల పాక్ జాతీయుడు ఆమెను గమనించి వెనకాలే వెళ్లి, మెడలోని చైన్‌ను లాగేందుకు యత్నించాడు.

ప్రమాదాన్ని పసిగట్టిన ఆమె గొలుసును గట్టిగా పట్టుకుని సహాయం కోసం కేకలు వేసింది.ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది.

#NRITelugu #Bur Dubai #PakistaniThief #Pakistani Chori

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Indian Man Attacked By Three Mask Wearing Pakistani Burglars In Uae Related Telugu News,Photos/Pics,Images..