యూఎస్: మనీలాండరింగ్ కేసులో భారతీయుడు అరెస్ట్

మనీలాండరింగ్ కేసులో అమెరికాలో ఓ భారతీయుడిని అరెస్ట్ చేశారు.అమిత్ అగర్వాల్ న్యూజెర్సీలోని ఈస్ట్‌ హనోవర్‌లో హోల్‌సేల్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు.

 Indian Man Arrested For Money Laundering Schemes In Us-TeluguStop.com

ఈ నేపథ్యంలో గతేడాది డిసెంబర్‌లో నెవార్క్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో గత ఏడాది డిసెంబర్‌లో అరెస్ట్ చేశాడు.అతనితో పాటు ఈ కేసులో ఆరుగురు కొలంబియా పౌరులను కూడా కొలంబియాలో అదుపులోకి తీసుకున్నారు.

అయితే వీరిని తమకు అప్పగించాలని అమెరికా ప్రభుత్వం కోరుతోంది.
దీనిపై యూఎస్ అటార్నీ జెఫ్రీ బెర్మన్ మాట్లాడుతూ.

మాదకద్రవ్యాల వ్యాపారం షాడో ఫైనాన్సియల్ నెట్‌వర్క్‌లపై ఆధారపడి ఉంటుందన్నారు.డ్రగ్స్ స్మగ్లర్లు తమకు అందిన లాభాలను అక్రమ మార్గాల్లో అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థల్లోకి తరలించేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు.

అమిత్ ఇతర నిందితులు అమెరికా, కొలంబియా రెండింటిలోనూ ఇదే రకమైన నెట్‌వర్క్‌లను నడిపినట్లు బెర్మన్ వెల్లడించారు.

Telugu Amit Agarwal, Indianrole, Scheme, Telugu Nri-

జూన్ 2018 నుంచి 2019 వరకు రెండు దేశాల్లో జరిగిన మనీలాండరింగ్ వ్యవహారాల్లో నిందితుల హస్తం ఉన్నట్లు మన్‌హట్టన్ ఫెడరల్ కోర్టుకు ఆధారాలు సమర్పించారు.ఇందులో భాగంగా మనీ బ్రోకర్లుగా వ్యవహరించిన కొలంబియా జాతీయులు రెండు దేశాల్లో సేకరించిన నిధులను వివిధ బ్యాంకు ఖాతాల్లో జమ చేసి.ఆపై అగర్వాల్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసేవారు.

ఈ కేసులో అమిత్ అగర్వాల్ దోషిగా తేలితే అతనికి గరిష్టంగా 20 సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube