యాసిడ్ దాడి: భారత సంతతి వ్యక్తికి 20 ఏళ్ల జైలుశిక్ష విధించిన యూకే కోర్టు

పొరుగింటి వ్యక్తిపై యాసిడ్ దాడికి పాల్పడిన కేసులో భారత సంతతి వ్యక్తికి యూకే కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.వివరాల్లోకి వెళితే.

 Indian Man Acid Twenty Years-TeluguStop.com

సంతోక్ జోహల్ అనే 53 ఏళ్ల భారత సంతతి వ్యక్తి.ఈస్ట్ లండన్‌లోని లేటన్‌లో నివసిస్తున్నాడు.

అతని పొరుగింట్లో 30 ఏళ్ల కుర్రాడు వుంటున్నాడు.ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి 4న ఆ కుర్రాడు కంగారుగా పోలీసులకు ఫోన్ చేశాడు.

తన ఎదురింట్లో ఉన్న వ్యక్తి తనను చంపుతానని బెదిరించాడని చెబుతున్నాడు.అయితే అతను ఫోన్‌లో మాట్లాడుతుండగానే జోహల్ కిటికీలోంచి అతనిపై యాసిడ్‌ను విసిరి పారిపోయాడు.

ఆ యువకుడికి చర్మం కాలిపోతూ విపరీతమైన నొప్పితో విలవిలలాడిపోయాడు.ఈ తతంగాన్ని ఫోన్‌లో పరిశీలిస్తున్న పోలీసులు హుటాహుటిన లండన్ అంబులెన్స్ సర్వీస్, లండన్‌ ఫైర్ బ్రిగేడ్‌లతో కలిసి ఘటనా స్థలికి చేరుకున్నారు.

బాధితుని శరీరంపై బూడిద రంగు గుర్తులున్నట్లు గుర్తించిన పోలీసులు వెంటనే అతనిని షవర్‌ దగ్గరకు తీసుకెళ్లి నీటితో తడిపి, వెంటనే ఆసుపత్రికి తరలించారు.అక్కడ బాధితుడి శరీరంలోని 20 శాతం చర్మానికి వైద్యులు శస్త్ర చికిత్స చేశారు.

డిశ్చార్జ్ అనంతరం నెలకొకసారి ఆసుపత్రికి హాజరవుతూనే ఉన్నాడు.

Telugu Indian Origin, Jailed Uk, Telugu Nri Ups, Acid-

ఘటన జరిగిన ప్రదేశానికి కెమికల్ నిపుణులు చేరుకుని.ఆ పదార్ధాన్ని సల్ఫ్యూరిక్ ఆమ్లంగా గుర్తించారు.ఒక వివాదం కారణంగా జోహల్‌ ఈ దాడికి పాల్పడ్డాడని నిర్థారించిన పోలీసులు.

అదే రోజున నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.అతనిపై దహనం చేసే ద్రవాన్ని విసిరేయడం లేదా దుర్వినియోగం చేడం, ఇతరులకు శారీరకమైన హానీ చేయాలని ప్రయత్నించడం వంటి అభియోగాలపై కేసు నమోదు చేశారు.

ఎనిమిది నెలల సుధీర్ఘ విచారణ అనంతరం గురువారం స్నారెస్‌బ్రూక్ క్రౌన్ కోర్టు నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్షను విధిస్తూ తుది తీర్పును వెలువరించింది.శిక్షా కాలంలో సంతోక్ జోహల్ కనీసం 15 సంవత్సరాల పాటు బార్ల వెనుక లైసెన్స్ లేదా పెరోల్‌తో పనిచేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube