కరోనా టెస్ట్‌కు విద్యుత్ రహిత పరికరం: అమెరికాలో భారతీయ శాస్త్రవేత్త బృందం ఘనత

ఏ వ్యాధికైనా నిర్ధారణ అతి ముఖ్యం.ఎందుకంటే దానిని గుర్తిస్తేనే చికిత్స చేయడానికి వీలు కలుగుతుంది.

 America, Manu Prakash, Corona Virus, Sepco Lab, Harvard University, Centrifuge D-TeluguStop.com

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ విషయంలో ఇది మరింత ప్రధానం.అంటు వ్యాధి కావడం, వ్యాక్సిన్ లేకపోవడం వల్ల ఇది మానవాళిని ప్రమాదంలోకి నెడుతోంది.

అందుకే వీలైనంత త్వరగా అనుమానితుడికి వ్యాధిని నిర్థారించాలి.ఇప్పటికే దీనిని గుర్తించేందుకు పలు రకాల సాధనాలు అందుబాటులోకి వచ్చాయి.

తాజాగా అమెరికాలోని భారతీయ శాస్త్రవేత్త సారథ్యంలో ఎలక్ట్రిసీటి ఫ్రీ (విద్యుత్ రహిత) పరికరాన్ని రూపొందించారు.కరోనా టెస్టులో భాగంగా బాధితుల నుంచి లాలాజల శాంపిల్స్‌ వేరు చేయడంలో దీనిని ఉపయోగించవచ్చు.

దీనిని అత్యంత చౌకైన, విద్యుత్ రహిత సెంట్రీఫ్యూజ్ డివైజ్‌కు చెబుతున్నారు.ప్రపంచంలోని పేద దేశాల్లో కరోనా నిర్థారణ పరీక్షలు మరింత పెంచేందుకు గాను అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తోంది.

అమెరికాలోని స్టాన్‌ఫోర్ట్ యూనివర్సిటీకి చెందిన భారతీయ శాస్త్రవేత్త మను ప్రకాశ్ సారథ్యంలోని బృందం ఈ పరికరాన్ని అభివృద్ధి చేసింది.ఇది చాలా ఎక్కువ వేగంతో శాంపిల్స్‌తో కూడిన ట్యూబ్స్‌ తిప్పుతుందని అంటున్నారు.

కోవిడ్ జన్యువును రోగి లాలాజల శాంపిల్స్ నుంచి వేరు చేయడానికి ఈ డివైజ్ సరిపోతుందని చెబుతున్నారు.

Telugu America, Centrifuge, Corona, Harvard, Manu Prakash, Sepco Lab-Telugu Visu

చౌకైన సెంట్రీఫ్యూజ్‌, యూనిట్‌కు 5 డాలర్ల కన్నా తక్కువ ఖర్చుతో అసెంబుల్ చేసుకోవచ్చు.ఇది నిమిషానికి 2000 రొటేషన్స్ (ఆర్‌పీఎం) అవసరమైన వేగాన్ని సురక్షితంగా అందించగలదు.ఇందుకుగాను నిమిషానికి వంద డాలర్లు ఖర్చవుతుంది.

విద్యుత్ సరఫరా కూడా అవసరం అవుతుంది.హ్యాండిఫ్యూజ్‌తో ఈ సమస్య ఉండదని ప్రకాశ్ చెబుతున్నారు.

ఇంతకుముందు ఇదే బృందం ఫోల్డ్ స్కోప్ అని పిలిచే చౌకైన ఓరిగామి మైక్రోస్కోప్‌ను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే.

Telugu America, Centrifuge, Corona, Harvard, Manu Prakash, Sepco Lab-Telugu Visu

విద్యుత్ రహిత్ LAMP ప్రోటోకాల్‌ను హార్వర్డ్‌లోని సెప్కో ల్యాబ్ నుంచి రూపొందించారు.ఇది కోవిడ్ పరీక్ష అవసరానికి సరిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.బొమ్మల షాపు నుంచి తీసిన ఫ్లాష్ లైట్ ఆధారంగా ఈ ఆలోచన మొదలైందని తెలిపారు.

రాబే, సెప్కో నుంచి LAMP ప్రోటోకాల్ ఉపయోగించి డివైజ్ పనితీరును ధృవీకరించారు.హ్యాండిఫ్యూజ్, సెప్కో రాబే నుంచి వచ్చిన పరీక్షతో కలిపి, సింథటిక్ కోవిడ్ 19 ఆర్ఎన్ఏను లాలాజలంలో మైక్రోలిట్రేస్‌కు 10-100 కాపీలు వరకు గుర్తించడంలో అద్బుతంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఈ పరికరం ఎంతవరకు సమర్థవంతంగా పనిచేస్తుందో గుర్తించాలంటే రోగి శాంపిల్స్‌ ధృవీకరించాల్సిన అవసరం వుందని చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube