అమెరికా : హైవేపై ఒకదానికొకటి గుద్దుకున్న కార్లు... భారతీయ యువకుడు మృతి

అమెరికాలో విషాదం చోటు చేసుకుంది.రోడ్డు ప్రమాదంలో భారతీయ యువకుడు దుర్మరణం పాలయ్యాడు.

 Indian Killed In Multi-vehicle Crash In United States , Indian  , Killed , Unite-TeluguStop.com

మృతుడిని 26 ఏళ్ల మన్‌ప్రీత్‌ సింగ్‌గా గుర్తించారు.వివరాల్లోకి వెళితే.

పెన్సిల్వేనియా రాష్ట్రం క్లారియన్ టౌన్‌షిప్‌లో పలు వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.మన్‌ప్రీత్ న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో నివసిస్తున్నారు.తన వ్యక్తిగత వాహనంలో ఈ నెల 24న ఉదయం 6.30 గంటలకు పెన్సిల్వేనియా వెళ్తున్న సమయంలో క్లారియన్ టౌన్‌షిప్‌ వద్ద వాహనాలు ఒకదానితో మరొకటి ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో మన్‌ప్రీత్ వాహనం కూడా చిక్కుకోవడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు.సహాయక బృందాలు అతనిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ మన్‌ప్రీత్ ప్రాణాలు కోల్పోయాడు.దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

ఇదిలావుండగా… కెనడాలో బస్సు బోల్తా పడిన ఘటనలో భారత సంతతి వ్యక్తి సహా నలుగురు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే.రహదారిపై పేరుకుపోయిన మంచు కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

మృతి చెందిన భారతీయుడిని పంజాబ్‌లోని అమృత్‌సర్ నగరానికి చెందిన కరణ్‌జిత్ సింగ్ సోధి (41)గా గుర్తించారు.మిగిలిన వారిని కెనడా అధికారులు గుర్తించాల్సి వుంది.డిసెంబర్ 24న వాంకోవర్ – కెలోవ్నా మార్గంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా సర్రే కేంద్రంగా పనిచేస్తున్న పంజాబీ వార్తాపత్రిక అకల్ గార్డియన్ ఎడిటర్ గుర్‌ప్రీత్ ఎస్ సహోటా ట్వీట్ చేశారు.ఇక కరణ్‌జిత్ ఒకానగాన్ వైనరీకి చెందిన రెస్టారెంట్‌లో చెఫ్‌గా ఉద్యోగం చేస్తున్నాడని.

తన భార్య, కుమారుడు, కుమార్తెను పంజాబ్‌లోనే వుంచి అతను కెనడాకు వచ్చినట్లు గుర్‌ప్రీత్ తెలిపారు.

Telugu Amritsar, Bus, Canada, Indian, Karanjotsingh, Manpreet Singh, York, Queen

అంతకుముందు ఈ బస్సు ప్రమాదంలో నలుగురు మరణించినట్లు రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు ధ్రువీకరించారు.ప్రమాద విషయం తెలుసుకున్న అనంతరం మూడు ఏరియా ఆసుపత్రులకు చెందిన వైద్య బృందాలు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని 53 మందికి చికిత్స అందించినట్లుగా తెలుస్తోంది.అత్యవసర పరిస్ధితి, క్షతగాత్రుల సంఖ్య భారీగా వున్నందున బాధితుల గుర్తింపు ఆలస్యమైనట్లు పోలీసులు తెలిపారు.

బస్సు ప్రమాదం జరగడానికి ముందు ఆ ప్రాంతంలో వడగాళ్ల వాన కురవడంతో పాటు విపరీతంగా మంచు కురిసిందని అధికారులు తెలిపారు.ప్రమాదంలో చిక్కుకున్న వారి క్షేమ సమాచారం తెలుసుకునేందుకు హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినట్లు ఇంటీరియర్ హెల్త్ ఒక ప్రకటనలో వెల్లడించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube