నిండు గర్భిణీ ని మోకాల్లోతు మంచులో మోసుకెళ్ళిన భారత జవాన్లు..!

సామాన్య ప్రజల కోసం భారత జవాన్లు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టడానికి రెడీగా ఉంటారు.ఇప్పటికే భారత జవాన్లు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సామాన్య ప్రజలను కాపాడి అందరి మన్ననలను పొందారు.

 Jammu Kashmir Army Helps Pregnant Woman To Reach Hospital In Snow, Jammu Kashmir-TeluguStop.com

అయితే తాజాగా భారత జవాన్లు చేసిన మరొక గొప్ప పని వెలుగులోకి వచ్చింది.జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం కుప్వారాలోని కరల్ పూర్ లో నెలలు నిండిన ఒక గర్భవతి కి పురిటి నొప్పులు వచ్చాయి.

అయితే ఆమెను ఆస్పత్రికి తరలించడానికి వీలుపడలేదు. మోకాల్లోతు మంచు పేరుకుపోవడంతో ఎటువంటి వాహనాలు అడుగు దూరం కూడా నడిచే పరిస్థితి లేదు.

అయితే ఈ సమయంలోనే ప్రసవవేదన తో ఇబ్బంది పడుతున్న ఒక గర్భిణీ సహాయం చేసేందుకు భారత జవాన్లు ముందుకు వచ్చారు.
మంగళవారం రాత్రి 11:30 గంటల సమయంలో ఇండియన్ ఆర్మీకి చెందిన ఆపరేటింగ్ బేస్ ఫార్కియాన్ గ్రామంలో నివసిస్తున్న మంజూర్ అహ్మద్ షేక్ తన భార్య పురిటి నొప్పులతో బాగా బాధ పడుతోందని ఆమెను ఎలాగోలా ఆస్పత్రికి తరలించాలని కోరాడు.దీంతో ఆర్మీ జవాన్లు వెంటనే అతని ఇంటికి వచ్చేశారు.గత కొన్ని రోజులుగా ఆ ప్రాంతంలో మంచు విపరీతంగా కురిసింది.దీంతో అక్కడి రోడ్లపై భారీగా మంచు పేరుకుపోయింది.అయితే గర్భవతిని ఆసుపత్రికి తరలించడానికి జవాన్లు ధైర్యం చేశారు.

మంచు వర్షం కురుస్తున్నా.అడుగు తీసి అడుగు వేసే పరిస్థితి లేకపోయినా.భారతీయ జవాన్లు మాత్రం ఆ నిండు గర్భిణిని ఒక మంచం పై మోస్తూ 3.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు.అయితే ఆమె జనవరి 5వ తేదీన ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.భారతీయ సైనికులు నిండు గర్భిణి ని ఆస్పత్రికి తరలించే దృశ్యాలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.

సైనికులు చేసిన ఈ గొప్ప పనికి నెటిజన్లు హేట్సాఫ్ చెబుతున్నారు.ఇకపోతే కాశ్మీరులో నిరంతరాయంగా హిమపాతం కురుస్తూనే ఉంది.

రోడ్ల పై మంచు భారీగా పేరుకుపోవడంతో రాకపోకలు ఆగిపోయాయి.దీనితో ఎటూ వెళ్ళలేక అక్కడి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube