హెచ్1 బీ వీసా మోసం: 21 మిలియన్లు దోచుకున్న భారతీయుడి అరెస్ట్

అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు విదేశీయులకు వీలు కల్పించే హెచ్‌1 బీ వీసాల విషయంలో కుంభకోణానికి పాల్పడిన భారతీయుడిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు.భారత్‌కు చెందిన 48 ఏళ్ల ఆశిస్ సాహ్నీ హెచ్ 1 స్పెషాలిటీ ఆక్యుపేషన్ వర్క్ వీసాల విషయంలో మోసాలకు తెరదీశాడు.2011- 2016 మధ్యకాలంలో ఆశిష్ ఈ తరహా మోసాలకు పాల్పడి దాదాపు 21 మిలియన్ డాలర్లు ఆర్జించాడని అధికారుల దర్యాప్తులో తేలింది.

 Indian National Arrested In Us Over $21 Million H-1b Visa Fraud Case, H-1b Visa-TeluguStop.com

ఇటీవల అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.

అతని నేరం రుజువైన పక్షంలో ఆశిష్‌కు సుమారు 10 సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.అంతేకాకుండా సాహ్నీ తప్పుడు స్టేట్మెంట్లతో కూడిన దరఖాస్తులు సమర్పించి… శాశ్వతంగా యూఎస్ పౌరుడిగా ఉండేందుకు ప్రయత్నించాడని కూడా పోలీసులు ఆరోపిస్తున్నారు.

Telugu Visa Fraud, Indiannational, Lottery-

కాగా అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగం చేయడానికి విదేశీయులకు హెచ్ 1బీ వీసా జారీ చేస్తారు.ప్రత్యేకమైన నైపుణ్యాలు కలిగిన వారికి మాత్రమే దీనిని మంజూరు చేస్తారు.ఇది మూడు రకాలు జనరల్, మాస్టర్స్, రిజర్వ్‌డ్.హెచ్ 1బీ వీసాలకు ఉన్న డిమాండ్ దృష్ట్యా… కోటికి మించి దరఖాస్తులు వస్తే లాటరీ విధానంలో వీసాలు కేటాయిస్తారు.

కంప్యూటర్ ర్యాండమ్‌గా వీటిని ఎంపిక చేస్తుంది.ఒకసారి హెచ్‌1 బీ వీసా లభిస్తే మూడేళ్లపాటు అమెరికాలో ఉండొచ్చు.

ఈ కాల పరిమితిని పొడిగించుకునే అవకాశం కూడా ఫెడరల్ ప్రభుత్వం కల్పించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube