సింగపూర్ నుంచీ అమెరికా కస్టడీలోకి భారతీయుడు..!!!!  

Indian In Custody From Singapore To America-

అమెరికాలో ఓ భారీ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ భారతీయుడిని తమకి అప్పగించమని అమెరికా సింగపూర్ అధికారులకి సందేశం పంపింది. దాంతో స్పందించిన సింగపూర్ అధికారులు అతడిని అప్పగించడానికి రంగం సిద్దం చేశారు. ఇంతకీ ఆ భారతీయుడు చేసిన నేరం ఏమిటంటే..

సింగపూర్ నుంచీ అమెరికా కస్టడీలోకి భారతీయుడు..!!!!-Indian In Custody From Singapore To America

అహ్మదాబాద్ కి చెందిన హితేష్ పటేల్ అనే వ్యక్తి అమెరికా వాసుల్ని లక్ష్యంగా చేసుకుని కాల్ సెంటర్ కుంభకోణం కుట్రలో భాగస్వామిగా మారాడు. అందుకు గాను పటేల్ పై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి.

అమెరికా విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన సింగపూర్ అందుకు తగ్గట్టుగా త్వరలో అతడిని అమెరికాకి అప్పగించనుంది.

అతడు రాగానే హ్యూస్టన్‌లోని ఫెడరల్‌ కోర్టులో హాజరుపరచనున్నారు. పటేల్‌ ఓ కాల్ సెంటర్ ని నిర్వహించడం ద్వారా అమెరికా పౌరులని పధకం ప్రకారమే మోసం చేశాడని, అమెరికా అసిస్టెంట్‌ అటార్నీ జనరల్‌ బ్రియాన్‌ తెలిపారు. నేర విచారణ జరిగి రుజువయితే భారీ జరిమానాతో, జైలు శిక్ష ఉంటాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.