యూఎస్‌లో 7.5 శాతానికి పడిపోయిన భారతీయ వలసలు  

Indian Immigration To Us Down 7.5% - Telugu Donald Trump, Indian Immigration To Us, Nri, Telugu Nri News Updates, Trump

అమెరికాలో గ్రీన్ కార్డ్ ఆధారంగా వలసవచ్చిన భారతీయుల సంఖ్య 2018తో పోలిస్తే 7.5 శాతం తగ్గినట్లు నేషనల్ థియేటర్ ఫర్ అమెరికన్ పాలసీ, యూఎస్ థింక్ ట్యాంక్ డేటా చెబుతోంది.డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమ్మిగ్రేషన్ విధానంలో కఠిన నిబంధనల కారణంగా భారతీయుల వలసలు తగ్గినట్లు సదరు ఏజెన్సీలు అభిప్రాయపడ్డాయి.2018 ఇయర్‌బుక్ ఆఫ్ ఇమ్మిగ్రేషన్ స్టాటిస్టిక్స్‌లో హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఇటీవల విడుదల చేసిన డేటాను విశ్లేషించగా… 2016 ఆర్ధిక సంవత్సరం నుంచి 2018 వరకు కనిపించిన మొత్తం క్షీణత 7.3 శాతం గా ఉంది.

Indian Immigration To Us Down 7.5%

నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ స్టువర్ట్ అండర్సన్ మాట్లాడుతూ.యూఎస్ కాన్సులేట్ల వద్ద పెద్ద సంఖ్యలో దరఖాస్తులు పోగుపడ్డాయని, వీటి జారీ ప్రక్రియలో ఆలస్యం కావడమో, తిరస్కరణకు గురవ్వడం వల్ల భారతీయ వలసదారులు అమెరికాలో కాలు పెట్టలేకపోతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.2016 ఆర్ధిక సంవత్సరంలో 64,687 మంది భారతీయులకు గ్రీన్‌కార్డులు మంజూరవ్వగా.2018లో అది 59,821కి పడిపోయింది.

డొనాల్డ్ ట్రంప్ 2017లో అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినతరం చేయడం, గ్రీన్‌కార్డ్ దరఖాస్తుల ప్రాసెస్‌లో తనిఖీలను ప్రవేశపెట్టారు.ఎగ్జిక్యూటివ్ అథారిటీ, అడ్మినిస్ట్రేటివ్ ఆంక్షలు, రెగ్యులేటరీ చర్యల ద్వారా చట్టపరమైన వలసలను తగ్గించడానికి ప్రాథమిక ప్రయత్నాలు జరిగాయని నివేదిక వెల్లడించింది.ఈ విధానాల కారణంగా అమెరికాకు విస్తృత ఆర్ధిక, జనాభా పరమైన ప్రభావాలను కలిగిస్తాయని అండర్సన్ తెలిపారు.ఆరోగ్య సంరక్షణ కోసం ఆర్ధిక సాయం చేయాల్సిందిగా ప్రభుత్వంపై ఆధారపడిన ఏ వ్యక్తి అయినా అమెరికా పౌరసత్వం పొందటానికి అర్హులు కాదని పబ్లిక్ ఛార్జ్ రూల్ చెబుతోంది.

ఈ నిబంధనపై ప్రస్తుతం సర్క్యూట్ కోర్టు స్టే విధించింది.ఒకవేళ న్యాయస్థానం దీనిని గనుక ఎత్తివేస్తే, వలసదారులపై పెద్దసంఖ్యలో ప్రభావం పడుతుంది.

తాజా వార్తలు