అమెరికాలో మనమే ఫస్ట్...ఎందులోనంటే...!!!  

Indian Immigrants Are Top In Usa-nri,telugu Nri News Updates

అమెరికాలో ఉంటున్న వివిధ దేశాల నుంచీ వచ్చిన ప్రవాసీయులలో ప్రతీ నలుగురిలో ఒకరు భారతీయుడేనని తాజా నివేదికలో వెల్లడయ్యింది.అమెరికాలో హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం అందించిన తాజా నివేదికలో ఈ విషయం తెలిసింది.

Indian Immigrants Are Top In Usa-nri,telugu Nri News Updates-Indian Immigrants Are Top In USA-Nri Telugu Nri News Updates

ఈ నివేదిక ప్రకారం అమెరికాలో నివాసం ఏర్పాటు చేసుకున్న విదేశీయులలో దాదాపు 60 శాతం మంది ఆసియా వాసులు ఉన్నారని తెలుస్తోంది.

 2016 లో సుమారు 5 .8 లక్షల మంది భారతీయులు రెసిడెంట్ నాన్ ఇమ్మిగ్రేషన్ గా ఉన్నట్లు తెలుస్తోంది.వీరిలో సుమారు 4.4 లక్షల మంది తాతాలిక ఉద్యోగాలు కాగా మిగలిన వారు విద్యార్ధులుగా ఈ నివేదిక తెలిపింది.అయితే ఈ విషయంలో చైనా వెనుకపడింది.కేవలం 3.4 లక్షల మందితో రెండవ స్థానంలో నిలిచింది.అయితే చైనా నుంచీ వచ్చిన వారిలో సుమారు 75 శాతం మంది విద్యార్ధులుగా ఉన్నారని ఈ నివేదిక వెల్లడించింది.

 ఇదిలాఉంటే భారత్, చైనా తరువాత మెక్సికో, కెనడా , దక్షిణ కొరియా , జపాన్ , సౌదీ అరేబియా వంటి దేశాలు ఉన్నాయి.అమెరికాలో 2019 లో సుమారు 9 మిలియన్ల నాన్ ఇమ్మిగ్రేషన్ వీసాలు ఇచ్చింది అమెరికా వీటిలో ఎక్కువగా పర్యాటకం ,వ్యాపార వీసాలు ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు.