జస్ట్‌ మిస్‌ : రైలు పట్టాలపై బైక్‌ పెట్టి దానిపై కూర్చున్నాడు... ఎందుకో తెలిస్తే కోపం, నవ్వు రెండు వస్తాయి  

Indian Husband Quarrel With Wife Cause To Train Stop-telugu Viral News,viral,viral In Social Media,రైలు పట్టాలపై బైక్‌ పెట్టి దానిపై కూర్చున్నాడు,షణ్ముగవేల్‌

కొందరు క్షణికావేశంలో ఏం చేస్తుంటారో వారికే అర్థం కాదు. ఆ తర్వాత ఆలోచించినా కూడా ఫలితం ఉండదు. ఎందుకంటే అంతా అయిపోతుంది..

జస్ట్‌ మిస్‌ : రైలు పట్టాలపై బైక్‌ పెట్టి దానిపై కూర్చున్నాడు... ఎందుకో తెలిస్తే కోపం, నవ్వు రెండు వస్తాయి-Indian Husband Quarrel With Wife Cause To Train Stop

ఆ క్షణంలో తప్పు చేస్తున్నాం, కాస్త ఆగి ఆలోచిద్దాం అనుకుంటే ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకోకుండా జీవితంతో పోరాడుతారు. ఇక కొందరు తాగిన మత్తులో మరి కొందరు భర్త కొట్టాడని, భార్యతో గొడవ పడి ఇష్టం లేని జీవితం వద్దని చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యకు పాల్పడుతూ ఉంటారు. తాజాగా తమిళనాడు శివగంగై అనే జిల్లాల్లో షణ్ముగవేల్‌ అనే 26 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకునేందుకు రైలు పట్టాలపైకి వెళ్లాడు. అయితే అతడు తన బండిని రైలు పట్టాలమీదకు తీసుకు వెళ్లి ఆపాడు.

రైలు దగ్గరకు వస్తుంది, చావు ఖయాం అనుకుంటున్న సమయంలో లోకో పైలెట్‌ పట్టాలపై ఏదో ఉన్న విషయంను గమనించాడు. దాంతో వెంటనే రైలును ఆపేయడం జరిగింది. రైలు ఆపి లోకో పైలెట్‌ మరియు ప్రయాణికులు అతడి వద్దకు వెళ్లారు. అతడు ఎంత చెప్పినా కూడా పట్టాల నుండి బండిని తీయక పోవడంతో పాటు, తన మీద నుండి రైలు పోవాల్సిందే అంటూ పట్టుబట్టాడు.

దాంతో చిరాకు కలిగిన లోకో పైలెట్‌ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వస్తున్న విషయం తెలుసుకుని షణ్ముగవేల్‌ అక్కడ నుండి ఉడాయించాడు..

షణ్ముగవేల్‌ అలా ఎందుకు చేశాడనే విషయంలోకి వెళ్తే. గత కొన్ని రోజుల నుండి భార్యతో షుణ్ముగవేల్‌ గొడవ పడుతూ వస్తున్నాడు. పని పాట లేకుండా తిని తిరుగుతున్న అతడిపై భార్య పదే పదే కోప్పడుతుంది. దాంతో అతడు ఆమె నుండి దూరం అవ్వాలని భావించాడు.

శుక్రవారం రాత్రి బాగా తాగి రైల్వే బ్రిడ్జీ కింద పడుకున్నాడు. తెల్లవారు జామున ఇంటికి పోవడం ఇష్టం లేక రైలు పట్టాలపైకి బండితో వెళ్లి అక్కడ ఆపాడు. అయితే తృటిలో అతడి ప్రాణాలు దక్కాయి..

ప్రస్తుతం పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. అతడు దొరికిన తర్వాత కౌన్సిలింగ్‌ ఇవ్వాలని భావిస్తున్నారు. ఈలోపు అతడు మరోసారి ఆత్మహత్యకు పాల్పడే అవకాశం కూడా ఉందనే నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులు అతడి కోసం వెదుకుతున్నారు.

భూమి మీద నూకలు ఇంకా ఉన్న కారణంగా అతడు ఇంకా కూడా బతికి ఉన్నాడు. అదే రైలు స్పీడ్‌గా వస్తు, లోకో పైలెట్‌ చూడకుండా ఉంటే పరిస్థితి ఏంటో ఊహించుకోవడానికే భయంకరంగా ఉంది. భార్యతో గొడవ పడి జీవితాన్ని దూరం చేసుకోవాలని అతడు తీసుకున్న నిర్ణయం నవ్వు తెప్పించడంతో పాటు, కోపాన్ని కూడా తెప్పిస్తుంది కదా.?