అమెరికా క్యాపిటల్ హిల్ వద్ద భారత వైద్యుల భారీ నిరసన...!!

అగ్ర రాజ్యం అమెరికాలో భారత సంతతి వైద్యులు రోడ్డెక్కారు.తమకు న్యాయం చేయాలంటూ అమెరికా క్యాపిటల్ హిల్ వద్ద నిరసన తెలిపారు.

 Indian Health Care Workers Demand Green Card Backlog , Green Card Backlog , In-TeluguStop.com

గ్రీన్ కార్డ్ జారీ విషయంలో తమకు అన్యాయం జరుగుతోందని గ్రీన్ కార్డ్ బ్యాక్ లాగ్ ను తొలగించాలని గొంతెత్తారు.గ్రీన్ కార్డ్ ఆమోదం కోసం వేచి ఉన్నవారిని గ్రీన్ కార్డ్ బ్యాక్ లాగ్ అంటారు.

అమెరికాలో శాశ్వత నివాసం కోసం అర్హత పొందాలంటే ఈ గ్రీన్ కార్డ్ బ్యాక్ లాగ్ తప్పని సరి.గ్రీన్ కార్డ్ కోసం ఇప్పటి వరకూ వేచి ఉన్న భారతీయుల సంఖ్య 8 లక్షల 15 వేల మంది పై మాటేనట.అయితే గ్రీన్ కార్డ్ బ్యాక్ లాగ్ లో దేశాల వారీగా విధించిన కోటాను రద్దు చేయాలని అందుకు గాను పార్లమెంట్ లో చట్టాన్ని ఆమోదించాలని వారు కోరారు.

దాదాపు 150 ఏళ్ళుగా బ్యాక్ లాగ్ కోటా కొనసాగుతోందని, అప్పటి నుంచీ పాత విధానాలనే అనుసరిస్తున్నారని, దాంతో ఏ దేశానికి చెందిన ప్రవాసీయుడు అయినా 7శాతానికి మంచి గ్రీన్ కార్డ్ రాదని వాపోతున్నారు వైద్యులు.

భారత దేశ జనాభా కొట్లలో ఉందని అయితే భారత్ కు ఇచ్చే కోటా అత్యంత తక్కువ జనాభా ఉన్న దేశం ఐస్లాండ్ తో సమానంగా కోటా ఇస్తున్నారని ఇది న్యాయం కాదని వాపోతున్నారు.ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని అమెరికా ప్రభుత్వం అసమానతలు తొలగించాలని కోరారు.

ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన ఇచ్చే కోటాను రద్దు చేసిన గ్రీన్ కార్డ్ జారీ చేయాలని భారతీయ వైద్యులు డిమాండ్ చేశారు.భారతీయ వైద్యులకు ఐటీ నిపుణులు కూడా మద్దతు తెలుపుతున్నారు.

ఎందుకంటే హెచ్-1 బి వీసాపై అమెరికా వెళ్ళిన వారిలో అత్యధికులు ఐటీ నిపుణులే.వీరిలో చాలా మందికి గ్రీన్ కార్డ్ జారీ విషయంలో ఇప్పటికి ఇమ్మిగ్రేషన్ విధానాలు అడ్డు పడుతున్నాయి.

ఇప్పుడు ఉన్న దేశీయ కోటా దద్దు చేస్తేనే కానీ భారతీయులకు న్యాయం జరగదనేది నిపుణుల అంచనా.అమెరికా ఆర్ధిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న భారతీయుల సేవలను దృష్టిలో పెట్టుకుని అయినా గ్రీన్ కార్డ్ బ్యాక్ లాగ్ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరుతోంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube