భారత ఎన్నారైలకు...విదేశీయులకు..కేంద్రం కీలక సూచన..ఇండియా వచ్చేలా ఉంటే...

కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమెక్రాన్ తో విరుచుకుపడుతోంది.తాజాగా ఈ వేరియంట్ పై పలు దేశాలు ఇప్పటికే రెడ్ అలెర్ట్ ప్రకటించగా, కొన్ని దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి, తమ దేశంలోకి వచ్చే వారిపై ఆంక్షలు కూడా విధించాయి.

 Indian Govt Revises Covid -19 Rules , Brazil, Bangladesh, South Africa, China,-TeluguStop.com

అయితే గత అనుభవాలని దృష్టిలో పెట్టుకున్న భారత ప్రభుత్వం తాజాగా విదేశీయుల రాకపై కీలక నిర్ణయం తీసుకుంది.కరోనా మొదటి వేవ్ లో పెద్దగా భారత్ పై ప్రభావం పడక పోయినా, సెకండ్ వేవ్ లో మాత్రం భారత్ అతలాకుతలం అయ్యింది.

ఈ పరిస్థితులను మళ్ళీ ఎదుర్కోకుండా ఉండాలంటే తప్పనిసరిగా నిభందనలు కటిన తరం చేయాలని భావించిన కేంద్రం విదేశీయుల రాకపై ఆంక్షలు విధించింది.

భారత్ విధించిన నిభందనలు ఏంటంటే.

– ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సరే భారత్ కు వచ్చే వారు తప్పకుండా ప్రయాణం అయ్యే తేదీ కంటే ముందు 14 రోజుల ట్రావెల్ హిస్టరీ ని ఎయిర్ సువిధ పోర్టల్ లో అప్లోడ్ చేయాలి.

– అలాగే ప్రయాణానికి 72 గంటల ముందు RTPCR పరీక్షలు చేయించుకోవాలి.వచ్చిన నెగిటివ్ రిపోర్ట్ ను అందించాలి.అంతేకాదు అవసరమైన ప్రభుత్వ నిభందనలకు అనుగుణంగా క్వారంటైన్ లో ఉంటామని ముందస్తు డిక్లరేషన్ ఇవాల్సి ఉంటుంది.

– ప్రభుత్వం అట్ రిస్క్ దేశాలుగా గుర్తించిన వాటిలో బ్రెజిల్, బంగ్లాదేస్, దక్షిణాఫ్రికా , చైనా, మారిషిస్, న్యూజిల్యాండ్, సింగపూర్, ఇజ్రాయిల్, హాంకాంగ్ వంటి పలు దేశాలు ఉన్నాయి.అట్ రిస్క్ గా గుర్తించిన ఆయా దేశాల నుంచి  వచ్చిన వారెవరైనా సరే ఇండియాలోకి వచ్చిన తరువాత తప్పనిసరిగా RTPCR టెస్ట్ చేయించుకోవాలి, టెస్ట్ లలో నెగిటివ్ వచ్చినా సరే వారం పాటు క్వారంటైన్ లో ఉండాల్సిందే.

– ఏడు రోజుల తరువాత ఎనిమిదవ రోజు మళ్ళీ టెస్ట్ చేసినపుడు నెగిటివ్ వస్తే మరో ఏడు రోజుల పాటు సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండి ఆ తరువాత అందరిలా బయట తిరిగేయచ్చు.ఒక వేళ ఎవరికైనా సరే పాజిటివ్ వస్తే.

– టెస్ట్ లలో పాజిటివ్ వస్తే వారిని క్వారంటైన్ సెంటర్ కి తరలించి మెరుగైన వైద్యం అందిస్తారు.అంతేకాదు వారితో పాటు కాంటాక్ట్ అయిన వారందరినీ హోమ్ క్వారంటైన్ లో వారం పాటు ఉంచుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube