ఉద్యోగాలకు ఎసరు.. మా వాళ్ల వీసా గడువులను పెంచండి: అమెరికాకు భారత ప్రభుత్వం విజ్ఞప్తి

అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే.ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం, వచ్చినప్పుడు చూసుకుందాంలే అన్న ట్రంప్ నిర్లక్ష్యం అమెరికన్ల ప్రాణాల మీదకు తెచ్చింది.

 Indian Govt Requests Us To Extend H-1b, Other Visas Of Indian Nationals, Us, H1-TeluguStop.com

ఈ సంగతి పక్కనబెడితే.కరోనా కారణంగా దేశంలో ఆర్ధిక సంక్షోభం తలెత్తే అవకాశాలు ఉన్నాయని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

దీని ప్రభావం భారతీయులపై పడింది.అమెరికాలో కరోనా కారణంగా నెలాఖరు నాటికి రెండు కోట్లమంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని అంచనా.

అమెరికాలో దాదాపు 4 లక్షల హెచ్1బీ వీసా ఉన్నవాళ్లు ఉంటే.అందులో సగం మంది భారతీయులే.

ఇప్పటికే భారతీయులతో పాటు పలువురు విదేశీయులు తమ వీసాలను పొడిగించాలని శ్వేత సౌధానికి దరఖాస్తు పెట్టుకుంటున్నారు.ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం సైతం రంగంలోకి దిగింది.కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చే వరకు భారతీయులకు సంబంధించి హెచ్1బీ, ఇతర వీసాల గడువులను పొడిగించాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరింది.హెచ్‌1బీ వీసాదారుల సేవలను నిలిపివేయాలని అమెరికా ప్రభుత్వం యజమానులను కోరుతున్నట్లు వార్తాకథనాలు వస్తున్నాయి.

Telugu Federal, Visa, Indian Extend, Lockdown, Visasindian-

ఫెడరల్ ప్రభుత్వం నుంచి అలాంటి అధికారిక ఉత్తర్వులు లేనందున హెచ్1బీ ఉద్యోగులను ఆదుకోవాలని కోరినట్లు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్ష్ ష్రింగ్లా.అమెరికా విదేశాంగ కార్యదర్శి స్టీఫెన్ బీగన్‌తో టెలిఫోన్ సంభాషణ జరిగినట్లుగా తెలుస్తోంది.హెచ్1బీ వీసాపై అమెరికాలో 3,00,000 మంది భారతీయులు పనిచేస్తున్నట్లు అధికారిక అంచనా.అమెరికాలో హెచ్1బీ హోల్డర్ ఉద్యోగ ఒప్పందాన్ని యజమాని రద్దు చేస్తే .తిరిగి హెచ్1బీ స్థితిని నిలుపుకోవటానికి 60 రోజుల్లో కొత్త ఉద్యోగ అవకాశాన్ని అన్వేషించాల్సి ఉంటుందని నిబంధనలు చెబుతున్నాయి.

కాగా అమెరికాలో కరోనా కారణంగా ఇప్పటి వరకు 18,777 మంది మరణించగా, 5,01,609 మంది ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.

భారత్, అమెరికాలలో లాక్‌డౌన్, ప్రయాణ ఆంక్షలు అమల్లో ఉండటంతో ఎక్కడి వారు అక్కడే ఉండాల్సిన పరిస్ధితి.ఇలాంటి పరిస్ధితుల్లో ఉద్యోగాలు కూడా పోతే భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాలి.

అందువల్ల వీరిని ఆదుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube