యాంటీ మలేరియా ఔషధాల ఎగుమతిపై నిషేధం... కరోనా ఎఫెక్ట్

ఇప్పటి వరకు కరోనాని అరికట్టడానికి సరైన ఔషధం ఏ దేశం కూడా తయారు చేయలేదు.ఉన్న మందులనే కరోనాలో వచ్చే లక్షణాల ఆధారంగా ఉపయోగిస్తున్నారు.

 Indian Govt Bans Export Of Anti-malarial Drug, Corona Virus, Covid-19, Indian Lo-TeluguStop.com

ఇప్పుడు కరోనా వ్యాప్తిని అరికట్టడంతో పాటు కరోనా వచ్చిన రోగులకి యాంటీ మలేరియా ఔషధాలు అయిన హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందులని వాడుతున్నారు.వీటితో కరోనా వైరస్ కంట్రోల్ కి వస్తుంది.

కరోనా వైరస్ రోగులకు హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడవచ్చని భారతీయ వైద్య పరిశోధనామండలి డైరెక్టరు జనరల్ భార్గవ సిఫార్సు చేయడంతో కేంద్రం ఈ ఔషధాల ఎగుమతిని నిలిపివేసింది.ఇప్పుడు అన్ని దేశాలు కరోనా యాంటీ డోస్ గా వీటిని వినియోగించడం మొదలెట్టాయి.

ఇక ఈ యాంటీ మలేరియా ఔషధమైన హైడ్రాక్సీక్లోరోక్విన్ ఉత్పత్తి ఇండియాలో ఎక్కువగా ఉంటుంది.ఇక్కడి నుంచే ఇతర దేశాలకి సప్లై చేస్తారు.ఇప్పుడు కరోనాకి ఇదే ఔషధం అని ప్రస్తుతానికి నిర్ధారణ కావడంతో ఈ ఔషధాల కొరత ఏర్పడకుండా ముందుజాగ్రత్తగా కేంద్ర విదేశాంగ శాఖ సూచన మేరకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ బుధవారం ఓ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.గత వారం కరోనా వ్యాప్తి నేపథ్యంలో శానిటైజర్లు, వెంటిలేటర్ల ఎగుమతిని కూడా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube