అదే జరిగితే ఇండియాలో వాట్సప్‌ త్వరలో కనిపించకుండా పోవడం ఖాయం..!

ప్రస్తుతం ప్రపంచం మొత్తం కూడా సోషల్‌ మీడియా వెనుక పరిగెడుతుంది.చిన్నా పెద్ద, ముసలి ముతక అనే తేడా లేకుండా కోట్లాది మంది వాట్సప్‌ను తెగ వాడేస్తున్నారు.

 Indian Government Will Ban Whatsapp In Country-TeluguStop.com

ఇండియాలో వాట్సప్‌ వాడే వారి సంఖ్య 25 కోట్ల వరకు ఉందని అధికారిక సమాచారం.ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 150 కోట్ల మంది వాట్సప్‌ను వాడేస్తున్నారు.

అత్యధికులు వాడుతున్న సోషల్‌ మీడియా నెట్వర్క్‌గా వాట్సప్‌ పేరుగాంచింది.వాట్సప్‌లో అద్బుతమైన ఫీచర్స్‌ వచ్చాయి.

మొదట్లో కేవలం మెసేజ్‌లు మాత్రమే పంపుకునే విధంగా ఉండేది.ఆ తర్వాత వాయిస్‌ కాల్స్‌, వీడియో కాల్స్‌ సదుపాయంను వాట్సప్‌ ఇచ్చింది.

వాట్సప్‌ వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చాయనడంలో ఎలాంటి సందేహం లేదు.అద్బుతమైన వాట్సప్‌ త్వరలో ఇండియాలో కనిపించకుండా పోయే అవకాశం ఉందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు.

ఇండియన్‌ ప్రభుత్వం కొత్తగా తీసుకు వచ్చిన నియమ నిబంధనలు వాట్సప్‌కు నచ్చడం లేదు.అలాంటి నియమాల వల్ల తమ వినియోగదారులకు ఇబ్బంది అంటూ వాట్సప్‌ కేంద్ర ప్రభుత్వం నిబంధనలను పట్టించుకోవడం లేదు.

ఇంతకు కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నిబంధనలు ఏంటో తెలుసా… వాట్సప్‌ వినియోగదారులు ఏ మెసేజ్‌ ఎవరికి పంపినా కూడా అది ఖచ్చితంగా తమకు తెలియాలి.ఒక వేళ అది అభ్యంతరక మెసేజ్‌ అయితే వెంటనే తొలగించేందుకు కూడా తమకు అవకాశం ఉండాలి.

ఇది వాట్సప్‌కు మాత్రమే కాకుండా అన్ని సోషల్‌ మీడియా సైట్లకు కూడా వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం అంటోంది.వాట్సప్‌ మాత్రం ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌స్క్రిప్షన్‌ సెక్యూరిటీతో సర్వీస్‌ను అందిస్తుంది.అంటే పంపిన వారికి, అవతల రిసీవ్‌ చేసుకున్న వారికి తప్ప మెసేజ్‌లు మరెవ్వరు కూడా చూడకుండా వాట్సప్‌ సెక్యూరిటీగా వినియోగదారులకు సేవలు అందిస్తుంది.ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త నిబంధన కోసం తమ పద్దతి మార్చుకోమని చెబుతున్నారు.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వినియోగదారులందరికి ఇస్తున్నట్లుగా కాకుండా ఇండియాకు ప్రత్యేకంగా ఎలా సేవలు అందిస్తాం.

ఇండియా వినియోగదారుల మెసేజ్‌లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం చదివేలా తాము వీలు కల్పించలేమని చెబుతున్నారు.వాట్సప్‌ ఇదే పట్టుదలతో ఉంటే ఇండియాలో వాట్సప్‌ను బ్యాన్‌ చేసే అవకాశం ఉంది.ఇప్పటికే కొన్ని దేశాలు వాట్సప్‌ను బ్యాన్‌ చేయడం జరిగింది.అదే కోవలో ఇండియాలో కూడా వాట్సప్‌ బ్యాన్‌ అయ్యేనోమో చూడాలి.25 కోట్ల మంది వినియోగదారులు ఉన్న వాట్సప్‌ ఇండియాను వదులుకుంటుందా అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube