ఆ 8 మంది ఎన్నారై భర్తలకి కేంద్రం షాక్..

కేంద్రం తాజాగా ఎన్నారై భర్తలపై ప్రవేశపెట్టిన బిల్లు మొదటి సారిగా అమలు అయ్యింది.భార్యలని వదిలేసిన 8 మంది ఎన్నారై భర్తలకు భారత ప్రభుత్వం షాక్ ఇచ్చింది…నేరస్థులుగా పరిగణించబడుతున్న వారి పాస్‌పోర్టులను రద్దు చేస్తున్నట్లు మహిళ మరియు శిశు అభివృద్ధి మంత్రిశాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి శుక్రవారం ప్రకటించారు…ఈ ప్రకటన ఒక్క సారిగా భార్యలని వదిలేసి ఉంటున్న ఎన్నారై భర్తలు ఉలిక్కిపడేలా చేసింది.

 Indian Government Shocks To 8 Nri Husbands-TeluguStop.com

అంతేకాదు ఈ కేసు ఎక్కడా వీగిపోకుండా ఉండటానికి విదేశీవ్యవహారాల శాఖా, హోంమంత్రిత్వశాఖా, మహిళ మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ సంయుక్తంగా నియమించిన ఓ కమిటీని నియమించారు.ఈ కమిటీకి కేవలం రెండు నెలల వ్యవధిలో మొత్తం 70 ఫిర్యాదులు అందాయి.ఈ ఫిర్యాదులపై విచారణ జరుపుతున్న కమిటీ 8 మంది ఎన్నారై భర్తల పాస్‌పోర్ట్‌లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.నిందిత వ్యక్తులకు లుక్‌అవుట్ నోటిసు కూడా జారీ చేస్తున్నామని తెలిపింది.

ఇదిలాఉంటే వినతులపై మహిళలకి వెసులు బాటు కల్పించే విధంగా మహిళ మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆన్‌లైన్‌లో ఓ కొత్త పోర్టల్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది.ఎన్నారైలకు సంబంధించిన పెళ్లిళ్ల నమోదును కేవలం వారం రోజుల్లోనే గుర్తించే వెసులుబాటును కల్పించాలని అన్నీ రాష్ట్ర ప్రభుత్వాలను మహిళ మరియు శిశు అభివృద్ధి శాఖా మంత్రి మేనకా గాంధీ ఈ సందర్భంగా కోరారు…అయితే గతంలో అనుకున్నట్టుగానే భార్యలని వదిలేసినా ఎన్నారై భర్తల ఆస్తుల స్వాధీనంపై ఆలోచన చేస్తున్నామని త్వరలో ఆ విషయంలో ఒక క్లారిటీకి వస్తామని తెలిపారు మేనకా గాంధీ

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube