మీకు వ్యక్తిగత భద్రత కరువయింది తెలుసా... ఇది చదివిన తర్వాత మీరే ఒప్పుకుని జాగ్రత్త పడుతారు

మన సెల్‌ఫోన్‌లు, కంప్యూటర్లపై కేంద్ర ప్రభత్వం నిఘా పెట్టింది.ఇక కంప్యూటర్లలో, సెల్‌ఫోన్‌లలో ఏం చేస్తున్నాము, అందులో ఉన్న డాటా అంతా కూడా ప్రభుత్వానికి తెలిసిపోతుంది.

 Indian Government Puts All Computers Smart Phones Under Surveillance-TeluguStop.com

ఏ కంప్యూటర్‌లోనైనా ఉన్న సమాచారం వెలికితీయడానికి, పర్యవేక్షించడానికి, అడ్డుకోవడానికి అన్ని అనుమతులు మంజూరు చేస్తున్నట్టుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.దేశానికి ప్రమాదం పొంచి ఉందని, అందుకే ఇలాంటి నిఘా పెట్టాల్సి వచ్చిందని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా ప్రకటించారు.

ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ), నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ), కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్‌ఐ), కేంద్ర దర్యాప్తు విభాగం (సీబీఐ), జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), క్యాబినెట్ సెక్రటేరియట్, డైరెక్టరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్ (జమ్ముకశ్మీర్, అసోం, ఈశాన్య రాష్ర్టాల వరకు), ఢిల్లీ పోలీస్ కమిషనరేట్‌లకు ఆ మేరకు నిఘాకు అధికారాలిస్తూ కేంద్రం ఆదేశాలు వెలువరించింది.

ఎవరి కంప్యూటర్‌లోని కార్యక్రమాలు అయినా అడ్డుకోవడానికి అర్హత ఉంటుంది.దీనికి అందరు సహకరించాలి లేదంటే వారు ఏడేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.ఇది వరకు మనదేశంలో వ్యాప్తిలో ఉన్న డేటాను నియంత్రించే అధికారాలు ఉన్నాయి.

కానీ దాని వల్ల పెద్దగా ఉపయోగం లేదు.సంఘ విద్రోహక శక్తుల కార్యకలాపాలు, కొన్ని కీలక దర్యాప్తులో ఇవి ఏమాత్రం సరిపోవడం లేదు.

సైబర్‌ నేరాలను, ఉగ్రవాద కార్యకలాపాలను అడ్డుకోవడానికి ఈ ఉత్తర్వులు జారీ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది.అవసరమైతే ఫోన్‌ టాపింగ్‌కు అనుమతులు ఉన్నాయంటూ గతంలోనే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెల్సిందే.

అయితే నిఘా డైరెక్ట్‌గా ఉండదు.ముందస్తుగా అనుమతి పొందాకే దర్యాప్తు సంస్థలు నిఘా పెట్టేందుకు వీలు ఉంటుంది.

ఈ విషయంలో చట్టం పౌరులకు అవసరం అయిన రక్షణలను కల్పించింది.సదరు దర్యాప్తు సంస్థ కేంద్ర హోం శాఖ, లేక రాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతి పొందాకే నిఘా పెట్టడం వీలవుతుంది.ప్రతి కంప్యూటర్‌లో దేనికదే విడివిడిగా అనుమతులు పొందాల్సి ఉంటుంది.అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై విపక్షాలు మండి పడుతున్నాయి.ఇలా సెల్‌ఫోన్‌లు, కంప్యూటర్లపై నిఘా పెట్టడం అంటే దేశం అంతా పోలీసు చర్చలో భాగం అయినట్టే.ఎవరికి వ్యక్తిగత భద్రత లేనట్టే అని విపక్షాలు కేంద్ర తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

దేశం అంతా కూడా నిఘా రాజ్యంగా మారిపోతున్నది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రాహుల్‌ గాంధీ దీనిపై స్పందిస్తూ మోదీజీకి ఉన్న అభద్రతా భావం వల్లనే ఇలా చేస్తున్నాడు అని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube