మొన్న DTH ఇప్పుడు కరెంటు...కేంద్రం సంచలన నిర్ణయం.! ఇకపై ఇష్టమొచ్చినట్టు కరెంటు ఉపయోగించడానికి లేదు!

డీటీహెచ్ సేవలపై కేంద్రం విడుదల చేసిన సరికొత్త రూల్స్ గురించి అందరికి తెలిసిందే.ఇకపై ఏ ఛానల్ కావాలంటే ఆ ఛానల్ కి సెపరేట్ గా చెల్లించాల్సిందే.

 Indian Government New Proposal On Power Distribution-TeluguStop.com

ఈ రూల్స్ తో టీవీ ఆడియన్స్ కి షాక్ ఇచ్చిన ప్రభుత్వం.ఇప్పుడు కరెంటు బిల్ పై లిమిట్ పెడుతూ మరో ట్విస్ట్ ఇచ్చింది.

ఓ రకంగా ఆలోచిస్తే ఇదొక బంపర్ ఆఫర్ లాంటిది కూడా.సరిగ్గా ఉపయోగించేవారికి లాభం…లిమిట్ దాటి ఉపయోగించేవారికి నష్టం.ఇప్పటివరకు స్లాబ్ రేట్ ని బట్టి బిల్ ఉండేది…కానీ ఇకపై కరెంటు బిల్ కూడా మొబైల్ రీఛార్జ్ లాగ ప్రీపెయిడ్ లో చెల్లించవలసి ఉంటుంది.వివరాలలోకి వెళ్తే.!

కొత్తగా ప్రీ-పైడ్ మీటర్లు అందుబాటులోకి రావడంతో నెల నెల కరెంటు బిల్లు కట్టాల్సిన పని తగ్గుతుంది.ఈ సారి ఎంత బిల్లు వస్తుందో అని భయపడాల్సినవసరం లేకుండా పోతుంది.ఏప్రిల్ 1 2019 నుంచి తప్పనిసరిగా అన్ని రాష్ట్రాలలో స్మార్ట్ ప్రీ- పైడ్ మీటర్లను ఏర్పాటు చేయాలి అని కేంద్ర విద్యుత్ శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ఎక్కువ మొత్తంలో కరెంటు వాడటాన్ని చెక్ పెట్టేందుకునే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.వినియోగించిన దానికంటే ఎక్కువ బిల్లు వస్తోంది అని ప్రజల నుంచి పిర్యాదులు వస్తున్నాయి అని వాటిని అరికట్టడానికి ఈ స్మార్ట్ ప్రీ-పైడ్ మీటర్లు ఏర్పాటు చేస్తునట్టు ప్రభుత్వం వెల్లడించింది.మరి ఇది సామాన్యుడికి లాభం అవుతుందో లేక భారం అవుతుందో వేచి చూడాలి!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube