గడ్డంతో ఉన్న మగవారిని ముద్దాడడానికి అమ్మాయిలు ఇష్టపడతారా ?  

ఎప్పుడు ఎలాంటి ట్రెండ్ నడుస్తుందో చెప్పలేం.మొన్నటిదాకా మూతి మీద మీసం ఉంటే అంకుల్ అని, మీసంతో పాటు గడ్డం కూడా ఉంటే సన్యాసి అని వెక్కిరించేవారు అమ్మాయిలు.

అందుకే బాలివుడ్ హీరోల్లో ఎవరు మీసాలు, గడ్డలు పెంచేవారు కాదు.ఇప్పుడు ట్రెండ్ మారింది.

TeluguStop.com - Indian Girls React On Kissing Man With Beard-General-Telugu-Telugu Tollywood Photo Image

మీసం సంగతేమో కాని, గడ్డంతో కనిపించే మగవారు సెక్సిగా కనిపిస్తారని స్టేట్‌మెంట్స్ ఇచ్చేస్తున్నారు ఈ కాలం మగువలు.చూడ్డానికి గడ్డం కావాలి సరే కాని ముద్దాడేటప్పుడు గడ్డం ఉంటే బాగుంటుందా ఉండకుంటే బాగుంటుందా?

ఈ విషయంపై ముంబైలో జరిగిన ఓ చిన్నపాటి సర్వేలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.“చూడ్డానికి గడ్డం బాగున్నా, ముద్దు పెట్టుకునేటప్పుడు గడ్డం గుచ్చుకుంటుంది, కొన్నిసార్లు ముక్కులోకి వెళ్ళిపోతాయి గడ్డం వెంట్రుకలు .అప్పుడు ఇబ్బందికరంగానే ఉంటుంది.కాని ఏం చేస్తాం.మగవాళ్ళని గడ్డంలో చూడటం ఇష్టం.కాబట్టి ఇలాంటివి ఓర్చుకోవాలి” అంటూ ఒక అమ్మాయి చెప్పుకొచ్చింది.

గడ్డం ఉన్నా ఫర్వాలేదు అనే అభిప్రాయమే ఎక్కువగా వినిపిస్తే, ముద్దు పెట్టుకునేటప్పుడు మాత్రం గడ్డం లేకపోతేనే బెటర్ అని కొంతమంది మాత్రమే చెప్పారు.

కాబట్టి అమ్మాయిలకి (భారతీయ అమ్మాయిలకి) అబ్బాయిలు గడ్డం గీయకపోవడమే ఇష్టమట.ఇంకేం చేస్తారు .పెరిగేంతవరకు పెంచుకుంటూ పోండి.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Indian Girls React On “kissing Man With Beard” Related Telugu News,Photos/Pics,Images..