అమెరికా కుర్రాడికి షాక్ ఇచ్చిన ఇండియన్ యువతి.! రితిక దెబ్బకు జోన్స్ సైలెంట్.!     2018-07-09   23:52:45  IST  Raghu V

ఆమె పేరు రితికా…. పుట్టింది నార్త్ ఇండియాలో అయినా చదువు పేరుతో 10 ఏళ్ళుగా అమెరికాలోనే ఉంటుంది. కానీ మనదేశ సాంప్రదాయాలన్నా, ఆచారాలన్నా అమితమైన ఇష్టం…అంతకు మించి గౌరవం. అయితే ఓ రోజు రితికా ఫ్రెండ్ బర్త్ డే ఉండడంతో ఆమె రితికా కు ఫోన్ చేసి ఆరోజు డిన్నర్ కు రావాలని ఇన్వైట్ చేసింది. సరే క్లోజ్ ఫ్రెండ్ పార్టీకి వెళ్లకపోతే బాగుండదని ఫ్రెండ్ చెప్పిన రెస్టారెంట్ కు నైట్ 9 వరకు చేరుకుంది. అప్పటికే అక్కడ ఓ 20 మెంబర్స్ దాకా ఉన్నారు.. అంతా పార్టీ మూడ్ లో ఉన్నారు. రితికా వాళ్లతో జాయిన్ అయ్యింది.

అందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు. ఒకరిమీద ఒకరు సెటైర్లు వేసుకుంటున్నారు. వారి చర్చ కాస్త…ఇండయన్స్ మీదకు మళ్లింది. రితికా వాళ్ల గ్రూప్ లో జోన్స్ అనే వ్యక్తి…ఛీ..ఛీ ఇండియన్స్ కు మ్యానర్స్ తెలియదు. వారు మలాన్ని తమ చేతితో కడుక్కుంటారు. అంత అపరిశుభ్రత అంటూ తన నోటికొచ్చినట్టు..ఇండియాను చీప్ చేస్తూ మాట్లాడాడు. అక్కడే ఉన్న రితికా జోన్స్ కు ఎలాగైనా బుద్ది చెప్పాలనుకుంది. వెంటనే అక్కడున్న వెయిటర్ ను పిలిచి ..ఆరెంజ్ జ్యూస్ ప్లీజ్ అంది..అడిగిన 3 నిమిషాల్లో వెయిటర్ ఆరెంజ్ జ్యూస్ తీసుకొచ్చి రితికాకు అందించాడు వెయిటర్.

ఆరెంజ్ జ్యూస్ ను చేతిలోకి తీసుకున్న రితికా…దానిని తాగుతున్నట్టు నటించి, దానిని జోన్స్ సూట్ మీద ఒలకబోసింది. సారీ జోన్స్… చేయి స్లిప్ అయ్యి మీ మీద జ్యూస్ పడింది అని చెప్పింది. దానికి జోన్స్ నో ప్రాబ్లమ్…నో ప్రాబ్లమ్ అంటూ….అక్కడున్న టిష్యూ పేపర్లతో…తన సూట్ మీద పడ్డ జ్యూస్ ను క్లీన్ చేసుకుంటున్నాడు. అయినా ఆ కలర్, స్మెల్ పోకపోవడంతో…అక్కడే మగ్ లో ఉన్న నీటిని తీసుకొని తన సూట్ మీద పడ్డ జ్యూస్ ను క్లీన్ చేసుకున్నాడు.

అంతా అయ్యాక…రితికా ..జోన్స్ తో మాట్లాడుతూ…..చూశావా..! జస్ట్ ఆరెంజ్ జ్యూస్ ను పూర్తిగా కడగాలంటేనే నీటిని ఉపయోగిస్తున్నావ్….అలాంటిది… మన శరీరం నుండి వెలువడే వ్యర్థపదార్థమైన మలాన్ని నీటితో కడిగితే ఎందుకు అంత చీప్ గా మాట్లాడతావ్..ఇప్పుడు చెప్పు మ్యానర్స్ లేనిది ఇండియన్స్ కా? లేక మీకా?? జోన్స్ సిగ్గుతో తలదించుకున్నాడు. రితికా ఫ్రెండ్స్ చప్పట్లతో రితికా ను ఆకాశానికెత్తారు.!