తెలంగాణా బాలిక..అమెరికాలో ఏమి చేస్తోంది..??

తెలంగాణా రాష్ట్రంలో జనగామా కి చెందిన ఓ బాలిక అమెరికా తల్లి తండ్రుల కష్టాలని తీర్చడానికి, పేదరికం నుంచీ వారిని బయటపడేయాలని అనుకుంది.అందుకు చదవు ఒక్కటే మార్గం అని భావించింది.

 Indian Girl From Telangana In Youth Exchange And Study Programs-TeluguStop.com

చదువుల్లో రాణించింది.తల్లి తండ్రులు పడుతున్న కష్టానికి తగ్గ ఫలితం సాధించింది.

ఎంతో మంది పోటీ పడే అమెరికా “ఎస్” ప్రోగ్రాం కి ఎంపిక అయ్యింది.అతిధి అనే పేరు ఉన్న ఈ బాలిక అమెరికాకే అతిధిగా వెళ్ళింది.

అమెరికా సంస్కృతి, సంప్రదాయాలపై అధ్యయనం చేసే ఈ “ఎస్‌” ప్రోగ్రాంకు ఎంపిక అవడం అంటే మాటలు కాదు.అయితే ఎంత కష్టం అయినా సరే తల్లి తండ్రులు తనకోసం పడే కష్టం ముందు ఇది పెద్దది కాదని అనుకుంది.చురుగ్గా ఉంటూనే చదువుల్లో రాణిస్తూ ఈ ప్రోగ్రాం కి ఎంపిక అయ్యింది.2017లో 10వ తరగతిలో 9.0 గ్రేడ్ సాధించి , పాలకుర్తిలోని బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీలో అడ్మిషన్‌ సంపాదించింది.

అక్కడ తన చదువు కొనసాగిస్తూనే యూత్‌ ఎక్స్చేంజ్‌ స్కీం “ఎస్‌” కు దరఖాస్తు చేసుకుంది.ఎన్నో కఠినమైన ఇంటర్వ్యూలను ఎదుర్కుని,పరీక్షలు రాసి వేలాదిమందిని పక్కకి నెట్టి ఏడాది పాటు అమెరికా సంస్కృతి, సంప్రదాయాలపై పరిశోధన, అధ్యయనం చేయడానికి వెళ్లింది.తమ కూతురు ఇలాంటి మంచి అవకాశాన్ని సంపాదించడం చాలా సంతోషంగా ఉందని అంటున్నారు అతిధి తల్లి తండ్రులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube