ముందస్తు .. ఉండొచ్చు ! సిద్ధమవుతోన్న పార్టీలు !

దేశంలోనే కాదు ఏపీలోనూ రాజకీయ పరిణామాలు చక చక మారిపోతున్నాయి.ఇప్పడు పార్టీల హడావుడి చూస్తుంటే.

 Indian General Election 2019-TeluguStop.com

ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.అందుకే పార్టీలన్నీ ముందే జాగ్రత్త పడుతున్నాయి.

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకే పార్టీలు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి.ఈ కారణంగానే… టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలున్నాయని పార్టీ నేతలకు సూచనలు పంపారు.

అంతే కాదు.వచ్చే ఆరు నెలలకు కార్యాచరణ కూడా ప్రకటించారు.ఆగస్టు పార్లమెంట్ సమావేశాల్లో అన్ని విపక్ష పార్టీలో ఢిల్లీలో భారీ ఆందోళనకు చంద్రబాబు ప్లాన్ చేశారు.ఇప్పుడు దీన్ని ముందుకు జరిపారు.అన్ని పార్టీల ఎంపీలతో.ఈ నెల చివరిలోనే ఢిల్లీలో సభ నిర్వహించాలని ఆదేశించారు.

ముందస్తు సూచనలతో మారిన వ్యూహమే దీనికి కారణం అని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.ఏడాది చివరిలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి.

ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది.బీజేపీపై తీవ్ర స్థాయిలో అధికార వ్యతిరేకత ఉంది.

ఎక్కడా గెలిచే అవకాశం లేదని ఇప్పటికే బీజేపీ వర్గాలు కూడా ఓ అంచనాకు వచ్చాయి.అందుకే ముందస్తుకు వెళ్లడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని ఢిల్లీలో జోరుగా వినిపిస్తోంది.

ఆ మూడు రాష్ట్రాలతో పాటే.పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని బీజేపీ కీలక నేతలు చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది.

ముందస్తు ఎన్నికలకు సంబంధించి తనతో సన్నిహితంగా ఉండే పార్టీలకు బీజేపీ లీకులించిందనే వార్త కూడా ఇప్పుడు రాజకీయవర్గాల్లో తిరుగుతోంది.ఇప్పటికే ఇతర ప్రాంతీయ పార్టీల నేతలతో.

ఈ మేరకు.చర్చలు జరిపినట్లు భావిస్తున్నారు.

పరిస్థితులు మారుతూండటంతో వేగంగా వ్యూహాలను మార్చేస్తున్నారు నాయకులు.ఇప్పుడు చంద్రబాబు ఆరు నెలల కార్యాచరణను ప్రకటించారు.

ఆరు నెలల కాలంలో 75 కార్యక్రమాల్లో పాల్గొంటానని ప్రకటించారు.పదమూడు జిల్లాల్లో యూనివర్శిటీల విద్యార్థులతో పాటు సేవా మిత్రలు, సాధికార మిత్రలతో సమావేశమవుతానంటున్నారు.

ఇక ఏపీలో బీజేపీ నేతలు కూడా టీడీపీ మీద దాడి ముమ్మరం చేయడంతోపాటు.రాజకీయంగా మైలేజ్ పెంచుకునే పనిలో పడ్డారు.ఇక వైసీపీ… జనసేన పార్టీలు జనాల్లో తిరుగుతూ మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నమయ్యే ఉన్నాయి.అంటే ముందస్తు ఎన్నికలు వస్తే మేం రెడీ అని ప్రతి పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube